Site icon NTV Telugu

బాబుది దొంగ దీక్ష.. షుగర్‌ లెవెల్స్‌ పెరిగేలా ఉంటుంది..!

Balineni Srinivasa Reddy

Balineni Srinivasa Reddy

టీడీపీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా దీక్ష చేపట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. అయితే, బాబు దీక్షపై సెటైర్లు వేస్తున్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ నేతలు.. చంద్రబాబు చేస్తున్నది దొంగ దీక్ష అంటూ కామెంట్‌ చేశారు మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.. 36 గంటలు కాదు.. 12 గంటలు కూడా ఆయన దీక్ష చేయలేరన్నారు. కేవలం అధికారం రాలేదనే సీఎం వైఎస్‌ జగన్‌ను పట్టుకుని నానా మాటలు అంటున్నారని విమర్శించారు.

చంద్రబాబు దీక్ష అంటేనే దొంగ దీక్ష అని కామెంట్ చేసిన బాలినేని.. ఆయన ఎప్పుడైనా ఓపెన్‌గా దీక్షలు చేయరని.. బాత్‌రూమ్‌కి వెళ్లి టిఫిన్‌ చేసి వస్తారంటూ ఎద్దేవా చేశారు. ఇక, గతంలో చంద్రబాబు దీక్ష చేసినప్పుడు ఆయన షుగర్‌ లెవల్స్‌ పెరిగాయని విమర్శించారు.. అధికారంలోకి రాలేదని.. రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. మరోవైపు.. పవన్‌ను టార్గెట్ చేసిన బాలినేని.. పోసాని ఇంటిపై దాడి జరిగింది.. దానిపై ఎవరూ మాట్లాడలేదు ఎందుకు? అని ప్రశ్నించారు. వైఎస్‌ జగన్‌కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఆయనపై బూతులు మాట్లాడితే ఎవరైకా కోపం రాదా? అంటూ వ్యాఖ్యానించారు మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి.

Exit mobile version