Minister Audimulapu Suresh Says Amaravati Houses Will Finish In 6 Months: ముఖ్యమంత్రి జగన్ సంకల్పం ముందు దుష్టశక్తుల పన్నాగాలు నిలవలేదని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. అమరావతి ప్రాంతంలో పేదలకు సొంతింటి కల నెరవేరుతోందని తెలిపారు. తాడేపల్లిలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. బలహీన వర్గాలకు వైసీపీ ప్రభుత్వం ఇళ్లు ఇస్తుంటే, రైతుల ముసుగులో వాటిని అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు ప్రయత్నించారని.. ఇది నిజంగా దుర్మార్గమని ధ్వజమెత్తారు. రెండు నుంచి మూడు లక్షల కోట్ల ఆస్తిని పేద మహిళల చేతిలో ముఖ్యమంత్రి పెట్టడం ఒక చరిత్ర అని వెల్లడించారు.
Yarlagadda Venkata Rao: కన్ఫ్యూజన్‌లో యార్లగడ్డ.. ఏ పార్టీ అనేది నో క్లారిటీ
కోర్టు కూడా పేదల పక్షాన నిలబడి.. ఇళ్ళ పట్టాలు ఇవ్వటానికి ఆమోదం తెలిపిందని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. సెంటు భూమిలో ఇల్లు కట్టి ఇస్తామంటే.. చంద్రబాబు అవహేళన చేశారని విమర్శించారు. సెంటు భూమిలో సమాధులు కట్టుకోమని పేదలను అవమానించారని విరుచుకుపడ్డారు. పెత్తందార్లు ఉన్న చోట పేదలు ఉండకూడదని చంద్రబాబు ఆలోచన చేశారన్నారు. ఆరు నెలల్లో పేదల ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతాయని హామీ ఇచ్చారు. షియర్‌వాల్ టెక్నాలజీ ద్వారా ఇళ్ళ నిర్మాణాలు వేగంగా పూర్తవుతాయని తెలిపారు. కేవలం నమ్మకంతోనే ప్రజల మనసును గెలవలేరని హితవు పలికారు. అన్ని వసతులతో జగనన్న ఊర్లు త్వరలోనే రానున్నాయని హర్షం వ్యక్తం చేశారు.
Malleshwari Case: పరాయి వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుందని.. భర్త ఏం చేశాడంటే?
అంతకుముందు కూడా.. రాజధానిలో పేదలకు ఇచ్చిన స్థలాల్లో నిర్మాణాలు పూర్తి చేసి తీరుతామని మంత్రి సురేష్ ఉద్ఘాటించారు. దీనిపై రైతులు సుప్రీంకోర్టుకు వెళ్తే.. తాము కూడా వెళ్తామని ఛాలెంజ్. హైకోర్టు తీర్పు ఎలా వచ్చినా.. నిర్మాణాలకు అడ్డంకి ఉండదని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే 5, 6 నెలల్లో 50వేల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. కాగా.. సోమవారం వైఎస్ జగన్ సీఆర్డీఏ పరిధిలోని కృష్ణయపాలెం లేఅవుట్‌లో పైలాన్‌ని ఆవిష్కరించారు. పేదల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి, మోడల్ హౌస్‌ను పరిశీలించారు.