మత్య్సకార సోదరుల మధ్య గొడవ దురదృష్టకరమైన సంఘటన అని ఏపీ పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఈ ఘటనపై ఆయన మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటామంటే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. సముద్రంలోకి లోపలికి వెళ్లి ఎవ్వరి బోట్లు వారే కాల్చుకుంటామంటే చట్ట ప్రకారం శిక్ష తప్పదని మంత్రి అన్నారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ రాకుండా అందరిని కంట్రోల్‌లోకి తీసుకున్నామని మంత్రి తెలిపారు.
Read Also: ఉద్యమాన్ని అణిచివేయడానికే సెలవులు: TPTF
మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రింగు వలలకు సంబంధించి గత కొన్నినెలులగా వాగ్వాదాలు జరుగుతుందన్నారు. నెట్ ఐ అనేది ఆఫ్ ఇంచ్ ఉండాలని, 8 కిలోమీటర్లు అవతల రింగ్ వలతో ఫిషింగ్ చేయలని మైరైన్, ఫిషరీస్ యాక్ట్ చెబుతుందని మంత్రి తెలిపారు. కోర్టులు కూడా ఇదే అంశాన్ని చెప్పాయన్నారు. రెండు గ్రూపుల మధ్య బేధాభిప్రాయాలు ఉన్నాయి. గతంలో మత్య్సకారులకు అవగాహాన సమావేశాలు నిర్వహించామని మంత్రి తెలిపారు. రేపు మరోసారి మత్స్యకారులందరితో సమావేశం నిర్వహించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి అప్పలరాజు తెలిపారు.
