Site icon NTV Telugu

Minister Anagani: తప్పు చేసిన వారు పీఎస్ఆర్ అయినా, పెద్దిరెడ్డి అయినా శిక్ష తప్పదు..

Anagani

Anagani

Minister Anagani: ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో ఎప్పుడూ చూడని ప్రగతి, సంక్షేమం ప్రస్తుతం కొనసాగుతుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. వీటిని చూసి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడుపు మండుతోంది అన్నారు. ఇక, అబద్దాలు, డైవర్షన్ పాలిటిక్స్ ను అలవాటుగా మార్చుకున్న జగన్ రెడ్డి.. తన బురదను ఎదుటి వారిపై రుద్దడానికి ప్రయత్నిస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు. సిగ్గు లేకుండా.. ఒక ఆడపిల్లను వేధించిన అధికారులను వెనకేసుకొస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ, మా ప్రభుత్వంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తప్పు చేసిన వారు పీఎస్ఆర్ అయినా, పెద్దిరెడ్డి అయినా శిక్ష తప్పదని మంత్రి సత్యప్రసాద్ పేర్కొన్నారు.

Read Also: IPL 2025: ఫిక్సింగ్ ఆరోపణలపై స్పందించిన రాజస్థాన్ రాయల్స్ టీమ్..

అయితే, రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని తాపించి వేలాది మంది ఆడ బిడ్డల తాళిబొట్లు తెంచి తమదే మంచి విధానమని చెప్పుకోవడం ఆధునిక గోబెల్ జగన్ రెడ్డికే చెల్లింది అంటూ మంత్రి అనగాని పేర్కొన్నారు. తప్పుడు కేసులు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించడంపై గతంలో కోర్టులు అనేకసార్లు నీకు, నీ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన సంగతి మరిచిపోయావా జగన్ రెడ్డి? అంటూ క్వశ్చన్ చేశారు. అలాగే, తిరుమల గోశాల వ్యవహారంలో అబద్దాలు చెప్పి భంగపడ్డావు.. ఇంకా నీ మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరు జగన్ రెడ్డి అని అనగాని సత్యప్రసాద్ విమర్శలు గుప్పించారు.

Exit mobile version