Ambati Rambabu: మంత్రి అంబటిరాంబాబు మరోసారి టీడీపీ నేతలపై విమర్శలు సంధించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు బుద్ధి లేదని.. బాలయ్యకు సిగ్గు లేదని.. లోకేష్‌కు అసలు బుర్రే లేదని అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది టీడీపీ వాళ్లకు తెలిసిన విషయమే కదా.. మళ్లీ ఎందుకు గుర్తుచేస్తున్నారు సార్ అంటూ పలువురు నెటిజన్‌లు కామెంట్ పెడుతున్నారు. అటు కొందరు నెటిజన్‌లు నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. అటు కొద్దిరోజుల కిందట ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రగడపై బాలకృష్ణ తీవ్ర విమర్శలు చేయడంతో మంత్రి అంబటి రాంబాబు ‘జోరు తగ్గించవయ్యా.. జోకర్ బాలయ్య’ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా కష్టంలో తండ్రిపై ప్రేమ చూపని బాలయ్యా.. నీకు సిగ్గు లేదయ్యా అంటూ మరో ట్వీట్ కూడా చేశారు.
బాబుకి బుద్ధి లేదు
బాలయ్యకి సిగ్గు లేదు
లోకేష్ కి బుర్రే…. లేదు!— Ambati Rambabu (@AmbatiRambabu) September 27, 2022
Read Also: ESIC to expand: దేశవ్యాప్తంగా 750 జిల్లాలకు విస్తరించనున్న ‘ఈఎస్‌ఐసీ’
మరోవైపు మంత్రి దాడిశెట్టి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడ జిల్లా తొండంగిలో మాట్లాడుతూ.. సీఎంగా ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఆయన చేతిలో రాష్ట్రం ఉండగా మంత్రివర్గ సభ్యుడైన నాదెండ్ల భాస్కర్‌రావుతో ఒకసారి, అల్లుడు చంద్రబాబు మరోసారి ఎన్టీఆర్ వెన్నుపోటు పొడిపించుకున్నారని మంత్రి దాడిశెట్టి రాజా వ్యాఖ్యానించారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని తెలిపారు. ఎన్టీఆర్‌కు, వైఎస్‌ఆర్‌కు పోలికే లేదు అని.. వైఎస్ఆర్ ప్రజల మనిషి అని మంత్రి దాడిశెట్టి రాజా కొనియాడారు.
