NTV Telugu Site icon

Andhra Pradesh: రైతులకు శుభవార్త.. కృష్ణా డెల్టాకు సాగునీరు విడుదల

Krishna Water

Krishna Water

ఏపీ రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. శుక్రవారం మధ్యాహ్నం కృష్ణా డెల్టాకు ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు సాగునీరు విడుదల చేశారు. కృష్ణా తూర్పు డెల్టాకు 1500 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 500 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జోగి రమేష్, మేరుగ నాగార్జున, విప్ సామినేని‌ ఉదయభాను, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సింహాద్రి రమేష్, ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పాల్గొన్నారు.

కృష్ణా డెల్టా చరిత్రలో ముందుగానే సాగునీటిని విడుదల చేయడం రికార్డు. ప్రతి ఏడాది కృష్ణా ఆయకట్టుకు జూలై నెలలో మాత్రమే సాగునీటిని విడుదల చేస్తుంటారు. అయితే ఈ ఏడాది నెలరోజుల ముందే సాగునీటిని ప్రభుత్వం విడుదల చేసింది. కృష్ణా డెల్టా పరిధిలో 13 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కృష్ణా డెల్టా పరిధిలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలు ఉన్నాయి. పులిచింతలలో పుష్కలంగా నీరు ఉండటంతో 35 టీఎంసీల సాగునీరు అందుబాటులోకి వచ్చింది. మరోవైపు ఏపీలో మరో రెండు రోజులలో రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణశాఖ అధికారులు చెప్తున్నారు. దీంతో తమకు ఈ ఏడాది సాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండబోదని రైతులు భావిస్తున్నారు. ఇప్పటికే జూన్ ఒకటి నుంచి గోదావరి డెల్టా పరిధిలోనూ సాగునీటిని ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పుడు కృష్ణా డెల్టాలోనూ సాగునీటిని విడుదల చేయడంతో ఖరీఫ్‌లో రెండో పంటను కూడా డిసెంబర్‌లోనే వేసుకునేలా రైతులు సన్నాహాలు చేసుకుంటున్నారు.

Show comments