Site icon NTV Telugu

Minister Ambati Rambabu: చంద్రబాబును సీఎం చేసేందుకే పవన్ తాపత్రయం

Ambati

Ambati

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. వారాహి ఎక్కి పవన్ పిచ్చి కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. మంత్రి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. పవన్, చంద్రబాబు ఇద్దరిలో అసహనం కనిపిస్తోందని పేర్కొన్నారు. ప్రాజెక్ట్‌ల పేరుతో గత ప్రభుత్వం దోచేసిందని.. పట్టిసీమ పేరుతో కూడా దోపిడీ చేశారని మంత్రి తెలిపారు. దోపిడీ కోసమే చంద్రబాబు ప్రాజెక్ట్‌లను ప్రారంభించారని మంత్రి ఆరోపించారు. అంతేకాకుండా.. పవన్ కళ్యాణ్ ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు మంచి చేయాలనే ఉద్దేశం చంద్రబాబుకు లేదని.. ప్రాజెక్ట్‌ల సందర్శన పేరుతో హడావుడి చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. చంద్రబాబు ప్రాజెక్ట్‌లను సందర్శించాక వర్షాలు ఆగిపోయాయని మంత్రి సెటైర్లు వేశారు.

Janago: మా భూమిని కబ్జా చేసారు.. దంపతుల సెల్ఫీ వీడియో.. సూసైడ్ లెటర్….!

అంతేకాకుండా.. ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లను దోపిడీ చేసిన దుర్మార్గుడు చంద్రబాబు అంటూ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ దండుపాళ్యం బ్యాచ్ అంటూ మంత్రి ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని దోచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని.. అంతేకాకుండా వాలంటీర్లపై పవన్ రోజుకో మాట మాట్లాడుతున్నారని మంత్రి అంబటి విమర్శించారు. పవన్ వాలంటీర్లను ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారని.. చంద్రబాబును సీఎం చేసేందుకే పవన్ తాపత్రయమని అంబటి పేర్కొన్నారు. పవన్ ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో చెప్పే దమ్ముందా అని మంత్రి సవాల్ విసిరారు. అంతేకాకుండా.. జనసేన కార్యకర్తలను పవన్ ముంచేస్తారని రాంబాబు జోస్యం చెప్పారు. విశాఖపై పవన్ పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు అనుగుణంగానే నిర్మాణాలు జరుగుతున్నాయని రాంబాబు స్పష్టం చేశారు.

Pawan Kalyan: 2024లో పవర్ స్టార్ ర్యాంపేజ్ చూస్తారు!

రుషికొండను సందర్శించే పేరుతో పవన్ కళ్యాణ్ హడావుడి చేశారని మంత్రి అంబటి పేర్కొన్నారు. కొండలను తొలగించి ఇళ్లు కట్టుకోవడం లేదా అని మంత్రి ప్రశ్నించారు. పవన్ కల్యాణ్‌లో అడుగడుగునా అసహనం కనిపిస్తోందని.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని మంత్రి స్పష్టం చేశారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తుంటే చర్యలు తప్పవని.. పవన్ ద్రోహం చేశారని రేణు దేశాయ్ స్వయంగా చెప్పారని అంబటి తెలిపారు. భర్త ఎలాంటి వాడైనా భార్య సపోర్ట్ చేయడం సాధారణమని మంత్రి అంబటి పేర్కొన్నారు.

Exit mobile version