Site icon NTV Telugu

Ambati Rambabu:చంద్రబాబుకి పుట్టగతులుండవ్

A Rambabu

A Rambabu

తెనాలి వచ్చి చంద్రబాబు ఏదేదో మాట్లాడారు.. ఈ మధ్య వచ్చిన చాలా సర్వేలు వైసీపీనే మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పాయన్నారు ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు. దీంతో చంద్రబాబులో ఫ్రస్టేషన్ పెరిగిపోయింది. చంద్రబాబు అధికారంలోకి రాకుండా చేశాం. సొంత కొడుకును మంగళగిరిలో ఓడించాం. దత్త పుత్రుడుని రెండు చోట్లా ఓడించి అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేశాం అన్నారు అంబటి. ఇదీ వైసీపీ ట్రాక్ రికార్డు.. అందుకే చంద్రబాబు కు భవిష్యత్తు ఎలా ఉంటుందో అర్ధం అయ్యింది.

Read Also: India Vs Zimbabwe: రెండో వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా.. మళ్లీ ఫీల్డింగ్‌కే కేఎల్ రాహుల్ మొగ్గు

కులాలను చూడనంటున్న చంద్రబాబు ఆత్మ ఘోషించటం లేదా? కులాల ప్రస్తావన తెస్తే చెప్పు తీసుకుని కొట్టమంటున్నారు చంద్రబాబు. ప్రజలు ఇప్పటికీ చెప్పు తీసుకుని కొట్టడం వల్ల ప్రతిపక్షంలో వెళ్ళి కూర్చున్నారు. వచ్చే ఎన్నికల్లో చెప్పుకు పేడ రాసి టీడీపీని కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. పోలవరం పై నేను అడిగిన మూడు ప్రశ్నలకు చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పటం లేదు?? కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్లు చంద్రబాబు గోరంట్ల మాధవ్ మార్ఫెడ్ వీడియో పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని మంత్రి అంబటి మండిపడ్డారు.

ఇంత దుర్మార్గమైన రాజకీయం చేస్తున్న చంద్రబాబుకు పుట్టగతులు ఉండవు. దేని మీద అయినా చర్చకు సిద్ధం అని సవాల్ చేశారు. చర్చించటానికి చంద్రబాబు అసెంబ్లీకి రాకుండా ఎందుకు తప్పించుకు తిరుగుతున్నావ్??అంటూ మంత్రి అంబటి ప్రశ్నించారు.

Read Also: CM KCR : మునుగోడులో గోల్‌మాల్‌ ఉప ఎన్నిక వచ్చింది

Exit mobile version