జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మంత్రి అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఒక సుంఠ….టీడీపీ వాళ్ళు పరమ సుంఠలు….పవన్ కు సినిమాలపై ఉన్నంత అవగాహన రాజకీయాలపై లేదు..పవన్ కళ్యాణ్ నడుపుతున్నది కాపు జనసేన కాదు కమ్మ జనసేన…..టీడీపీ స్కిప్ట్, మనోహర్ డైరెక్షన్లో నడుస్తున్న జనసేనను కమ్మ పార్టీ అనకుండా ఏమి అనాలి…!? కార్టూన్ సినిమాలతో కాలక్షేపం చెయ్యడం పవన్ కళ్యాణ్ కు అలవాటు అని ఎద్దేవా చేశారు. కార్టూన్ సినిమాల్లో విలన్ పేర్లు చూసి అందరికి పెడుతున్నాడు..
పవన్ కళ్యాణ్ ఎవరితో కలిస్తే మాకేంటి..? పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ తో మాకు పొత్తు ఏమిటి..? చిరంజీవిని జగన్మోహన్ రెడ్డి నమస్కారం పెట్టమన్నారా..సీఎం జగన్మోహన్ రెడ్డి దంపతులు చిరంజీవిని ఎంత గౌరవించారో చిరంజీవినే స్వయంగా చెప్పారు..పవన్ ఓడిపోయిన భీమవరంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చిరంజీవి ఆలింగనం చేసుకోవడాన్ని పవన్ జీర్ణించుకోలేక పోతున్నారు..తమకు జీవితం జీవనం చిరంజీవినే అన్న సంగతి పవన్ గుర్తు పెట్టుకోవాలి. కాపులు నాకు ఓట్లు వేయలేదని పవన్ చెప్పారు..కాపులు ఓట్లు వేస్తే 40 సీట్లు వచ్చేవాని పవన్ అన్నారు..పవన్ కు ధైర్యం ఉంటే 175 అసెంబ్లీ 25 ఎంపీలకు పోటీ చేస్తామని చెప్పాలి..
ఇటు విశాఖలో లోకేష్ ధర్నాపై మంత్రి అమర్నాథ్ సెటైర్లు వేశారు. లోకేష్ ది సిల్లీ ఫేస్….రాజకీయ నాయకుడిగా గౌరవిద్దాం అనుకున్నా ముఖం చూస్తుంటే నవ్వే వస్తుంది. లోకేష్ పెళ్లిళ్లు, పేరంటాలకు తిరగడానికి తప్ప రాజకీయాలకు పనికిరాడు. పేరంటాలకు వెళ్లి గంధం రాయించు కుని., జాకెట్టు ముక్క తాంబూలం తీసుకుని వెళ్లిపోకుండా పోరాటాలు ఎందుకు? అన్నారు మంత్రి అమర్నాథ్.
Read Also: Vijayashanti: కేసీఆర్ BBCకి ఎవరూ లొంగొద్దు.. ఆయనకు బుద్ధి చెప్పండి
