Site icon NTV Telugu

Adimulapu Suresh: క్లీన్ మునిసిపాలిటీగా విజయవాడ.. క్లీన్ బిగ్ సిటీగా వైజాగ్

Ap Swachh

Ap Swachh

“స్వచ్ఛ అమృత మహోత్సవ్” లో భాగంగా ఏపీకి “స్వచ్ఛ సర్వేక్షణ” అవార్డులు ఏపీకి 11 “స్వచ్ఛ సర్వేక్షణ” అవార్డులు లభించాయన్నారు ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. రాష్ట్రపతి చేతుల మీదుగా “స్వచ్ఛ సర్వేక్షన్” అవార్డులు అందుకున్నారు మంత్రి ఆదిమూలుపు సురేష్,పట్టణ స్థానిక సంస్థల ప్రతినిధులు. “స్వచ్ఛ సర్వేక్షన్” అవార్డులు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు మంత్రి సురేష్. స్థానిక యంత్రాంగం, అధికారులు,అన్ని వ్యవస్థల కృషితోనే అవార్డులు వచ్చాయన్నారు. గతంలో ఎన్నడూ లేనట్లుగా రాష్ట్రానికి కేంద్ర స్వచ్ఛ అవార్డులు వచ్చాయి.

తిరుపతి మున్సిపల్ కార్పోరేషన్ కు “సఫాయి మిత్ర” మున్సిపల్ కార్పొరేషన్ కింద మొదటి ర్యాంక్ వచ్చింది. క్లీన్ మున్సిపాలిటీగా విజయవాడ, “క్లీన్ బిగ్ సిటీ” గా విశాఖపట్నం అవార్డు అందుకుంది. పులివెందులకు “బెస్ట్ ఇన్నోవేషన్” అవార్డు, పుంగనూరుకు “బెస్ట్ సిటిజన్ ఫీడ్ బ్యాక్” అవార్డు వచ్చింది. విశాఖపట్నం “టాప్ ఇంపాక్ట్ క్రియేటర్” గా అవార్డు వచ్చింది, శ్రీకాకుళం మున్సిపాలిటికి రెండు అవార్డులు వచ్చాయన్నారు. “గార్బేజ్ ఫ్రీ సిటీ” (చెత్త రహిత పట్టణం) గా విశాఖ, తిరుపతి, విజయవాడకు “ఫైవ్ స్టార్ సిటీ” అవార్డులు వచ్చాయన్నారు మంత్రి సురేష్.

Read Also: Sunil Deodhar: నరేంద్రమోడీ పథకాలకు.. జగన్ స్టిక్కర్లా?

దేశంలో “ఆల్ ఇండియా టాప్ టెన్” నగరాల్లో మూడు నగరాలు విశాఖ,తిరుపతి,విజయవాడ ఉన్నాయి. టాప్ 100 లో 7 సిటీలు ఉన్నాయి. ఈ జాబితాలో కర్నూలు, తిరుపతి, నెల్లూరు, కడప, రాజమండ్రి,జివిఎంసి, ఎంవిఎంసి ఉన్నాయని మంత్రి వివరించారు. క్లీన్ ఏపీలో భాగంగా గడిచిన మూడేళ్ళలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఆధారంగా “బెస్ట్ ప్రాక్టిసెస్” కింద కేంద్రం అవార్డులు ఇచ్చింది. వాలంటీర్ల వ్యవస్థ ఎంతో ఉపయోగకరంగా ఉంది.

పట్టణీకరణ ఒక ప్రాంతానికి పరిమితం చేయకూడదు. ఏపీలో “అర్బన్ డెవలప్మేంట్ అథారిటీస్” పెంచాం అన్నారు మంత్రి సురేష్. పట్టణాలలో చెత్తను ప్రత్యామ్నాయ వనరుల ఏర్పాటుకు ఉపయోగిస్తున్నాం. “ఓపెన్ డేఫికేషన్ ఫ్రీ “ , మురుగు నీటి శుద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. “క్లీన్ ఏపీ” కార్యక్రమంపై నిఘా పెడుతున్నాం. “రియల్ టైమ్ మానిటరింగ్” చేస్తున్నాం. అన్ని జిల్లా కేంద్రాలను “స్మార్ట్ సిటీస్” గా తయారు చేసేందుకు కృషి చేస్తున్నాం అన్నారు మంత్రి సురేష్.

Read Also: YS Sharmila: సీఎం కేసీఆర్‌కు సవాల్.. ముక్కు నేలకి రాసి నేనే ఇంటికెళ్లిపోతా

Exit mobile version