NTV Telugu Site icon

Adimulapu Suresh: అందుకే నేను చొక్కా విప్పా.. సిగ్గు పడటం లేదు..

Adimulapu Suresh

Adimulapu Suresh

Adimulapu Suresh: ఎర్రగొండపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. రాళ్ల దాడులు, కర్రలతో దాడులు.. సవాళ్లు, ప్రతి సవాళ్లు.. అంతేకాదు.. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్‌ చొక్కా విప్పడం చర్చగా మారింది.. అయితే.. తాను చొక్కా విప్పడాన్ని సమర్థించుకున్నారు మంత్రి.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. నిరసన వ్యక్తం చేస్తే మీ ఇంటిని తగులబెడతారు అనటంతోనే నేను చొక్కా విప్పాను.. దానికి నేను సిగ్గు పడటం లేదన్నారు.. ఎర్రగొండపాలెం ఘటనలో చట్టం తన పని తాను చేసుకుని పోతుందన్న ఆయన.. గవర్నర్ కు, డీజీపీకి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదన్నారు.. మా ఆఫీసు ముందు నిలబడి చంద్రబాబు మమ్మల్ని అవహేళన చేశాడు.. మేం దాడికి పాల్పడలేదు.. దీనిపై కాణిపాకం గుడి దగ్గర ప్రమాణం చేయటానికి నేను సిద్ధం అని ప్రకటించారు ఆదిమూలపు సురేష్‌.

Read Also: Bandi Sanjay : ఏ రైతును చూసినా కన్నీళ్లు వస్తున్నయ్

చంద్రబాబు తీరు దొంగే దొంగా దొంగా అన్నట్లు ఉంది అంటూ మండిపడ్డారు మంత్రి సురేష్‌.. నిరసన వ్యక్తం చేస్తానని రెండు రోజుల ముందే చెప్పాను.. చంద్రబాబు క్షమాపణ చెబితే నియోజకవర్గంలో నేనే స్వయంగా స్వాగతం చెబుతాను అని కూడా చెప్పాను అని గుర్తుచేశారు.. నేను ముందు దళితుడిని.. ఒక దళితుడిగా చొక్కా విప్పి నిరసన వ్యక్తం చేశాను.. మా దళిత జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడు కోవటానికి ఎంత దూరం అయినా వెళ్తానని ప్రకటించారు మంత్రి ఆదిమూలపు సురేష్‌.