కోనసీమ జిల్లా పేరు మార్చడం.. కోనసీమ జిల్లాను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమగా పేరు మార్పు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రాథమిక ఉత్తర్వులు జారీ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. నిన్న విధ్వంస ఘటనలు చోటు చేసుకున్నాయి.. అయితే, ఈ ఆందోళలనపై మండిపడ్డారు మంత్రి ఆదిమూలపు సురేష్.. అన్ని వర్గాల సూచన, కోరిక మేరకే అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చటం జరిగిందన్న ఆయన.. అంబేద్కర్ ఒక కులానికో ఒక వర్గానికో చెందిన వాడు కాదు.. అంబేద్కర్ అందరివాడు.. కానీ, ఈరోజు మహానుభావుని పేరును ఒక జిల్లాకు పెట్టడాన్ని వ్యతిరేకించడం చాలా బాధాకరం అన్నారు.
Read Also: Konaseema: అష్టదిగ్భందంలో అమలాపురం..!
కొన్ని దుష్ట శక్తులు రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగా అల్లర్లు సృష్టించాలని చూస్తున్నాయి ఆరోపించారు మంత్రి ఆదిమూలపు సురేష్.. ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టడం ద్వారా మహానుభావుడు అంబేద్కర్ కు ఈ ప్రభుత్వం గొప్ప గౌరవాన్ని ఇచ్చిందన్న ఆయన.. మంత్రి విశ్వరూప్, ఇతర ప్రజాప్రతినిధుల ఇళ్లపై అల్లరి మూకల దాడిని ఖండిస్తున్నాం అన్నారు. ఈ పరిణామాలన్ని చూస్తుంటే పథకం ప్రకారం అల్లర్లు సృష్టించాలనే ఎత్తుగడలో భాగంగా కనిపిస్తోందన్నారు. కాగా, కోనసీమ జిల్లాలో 144 సెక్షన్ కొనసాగుతోంది. అమలాపురంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.