ఏపీలో ఉపాధి హామీ పథకం పనుల బిల్లుల చెల్లింపు వ్యవహారం నిత్యం హాట్ టాపిక్ అవుతూనే వుంది. నరేగా బిల్లులు చెల్లించకపోవడంపై హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ నరేగా బిల్లులు చెల్లించలేదని హైకోర్ట్‌లో కోర్టు ధిక్కార పిటిషన్లు దాఖలయిన సంగతి తెలిసిందే. 300 పిటిషన్లను విచారించింది హైకోర్టు.
ఈ నెల 21వ తేదీలోపు నరేగా బిల్లులను చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది హైకోర్ట్. బిల్లులు చెల్లింపులో జాప్యంపై వివరణ ఇచ్చేందుకు హైకోర్టుకు వచ్చిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ. బిల్లులు చెల్లింపుల్లో ఎందుకు ఆలస్యం జరుగుతుందంటూ సీఎస్సును ప్రశ్నించారు న్యాయమూర్తి. ప్రాధాన్యత క్రమంలో బిల్లులు చెల్లిసున్నామని బదులిచ్చారు సీఎస్ సమీర్ శర్మ. బిల్లులు సకాలంలో చెల్లించేలా కార్యదర్శులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. బిల్లులు చెల్లించకపోవడంతో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని పిటిషనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.