NTV Telugu Site icon

Mekapati Goutham Reddy Funeral: అంత్యక్రియల స్థలం మారింది..

ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు ఎల్లుండి నిర్వహించనున్నారు.. అయితే, ముందుగా ప్రకటించినట్టుగా ఆయన స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో కాకుండా.. మరోచోట అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు ఎల్లుండి నిర్వహించనున్నారు.. ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీ వద్ద గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు జరగబోతున్నాయి.. ప్రస్తుతం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలోనే గౌతమ్‌రెడ్డి భౌతిక కాయం ఉండగా.. రేపు ఉదయం నెల్లూరుకు తరలించనున్నారు.. ఎయిర్ అంబులెన్స్ ద్వారా భౌతికకాయాన్ని నెల్లూరుకు తరలించనున్నట్టు వెల్లడించారు మంత్రి ఆదిమూలపు సురేష్.

Read Also: Ministry of Finance: బ్యాంక్ అకౌంట్ల నిర్వహణ.. కొత్త మార్గదర్శకాలు..

ఉదయగిరిలోని మెరిట్స్ ఇంజినీరింగ్ కాలేజీ దగ్గర గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలిపారు మంత్రి ఆదిమూలపు సురేష్.. రేపు ఉదయం ఎయిర్ అంబులన్స్ ద్వారా గౌతమ్‌రెడ్డి పార్థివదేహాన్ని నెల్లూరుకు తరలిస్తామని తెలిపిన ఆయన.. ఉదయం 9 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుండి ఎయిర్‌ అంబులెన్స్‌ టేకాఫ్ అవుతుందని తెలిపారు.. ఇక, ఉదయం 10.15 గంటలకు నెల్లూరు పరేడ్ గ్రౌండ్‌కు భౌతికకాయం చేరుకుంటుందని.. ఉదయం 10.45 గంటలకు నెల్లూరులోని ఆయన ఇంటికి తరలిస్తామని.. అక్కడే ప్రజల సందర్శనార్థం భౌతికకాయం ఉంచుతామని.. 23వ తేదీన ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని వెల్లడించారు.. అంతిమ సంస్కారాలు ఉదయగిరి మెరిట్స్‌ ఇంజనీరింగ్ ప్రాంగణంలో పూర్తి అధికార లాంఛనాలతో నిర్వహించనున్నట్టు తెలిపారు మంత్రి ఆదిమూలపు సురేష్‌.