ప్రస్తుత రాజకీయాలంటే తనకు విరక్తి కలుగుతోందన్నారు ఎన్.టి.వి.తో ఉదయగిరి ఎం.ఎల్.ఏ.మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. ప్రస్తుత రాజకీయాలు తనకు పడవన్నారు. రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా అని సంచలన ప్రకటన చేశారు. కోట్లు పెట్టి రాజకీయం చేయలేను. నా వారసులు కూడా రాజకీయాల్లోకి రారు. మేకపాటి కుటుంబ సభ్యులు పోటీ చేసినా ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోను. ఉదయగిరి నుంచి నాలుగు సార్లు ఎం.ఎల్.ఏ.గా గెలిచా..ఇది చాలు నాకు..నా కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా ఉంటానన్నారు చంద్రశేఖర్ రెడ్డి.
Read Also: Earthquake: జపాన్ లో భారీ భూకంపం.. నో సునామీ వార్నింగ్..
వచ్చే ఎన్నికల్లో నాకు టికెట్ ఇవ్వలేమని చెప్పారు. ఇప్పటికే ఒక వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకుని హామీ ఇచ్చారు. నన్ను రాజకీయంగా దూరం చేసేందుకే కుట్ర పన్ని నాపై ఆరోపణలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగిందో చెప్పినా పట్టించుకోలేదు. కొంతమంది వ్యక్తులు నాపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు మేకపాటి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఓటమి తర్వాత పార్టీ అధిష్టానం మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలు ఆయనను ఇబ్బంది పెడుతున్నాయని ఆయన సన్నిహితులే చెబుతున్నారు. సోమవారం మాజీ మంత్రి అనిల్ కూడా మేకపాటిపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
Read Also: Shocking Survey: అబ్బాయిలూ.. అది క్లీన్ చేస్తున్నారా.. లేకపోతే శృంగారంలో..