ఏలూరు జిల్లాలోని ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం పోరస్ కెమికల్ కంపెనీలో బుధవారం అర్థరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో సంఘటన స్థలాన్ని ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోరస్ మృతులకు ప్రభుత్వం వైపు నుంచి రూ. 25 లక్షలు.. కంపెనీ వైపు నుంచి రూ. 25 లక్షలు నష్టపరిహరం అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. తీవ్ర క్షతగాత్రులకు రూ. 5 లక్షలు, స్వల్ప క్షతగాత్రులకు రూ. 2 లక్షలు ఇస్తారని ఆయన వెల్లడించారు.
క్షతగాత్రులకు వెంటనే రూ. 1 లక్ష నష్ట పరిహరం అందిస్తామని ఆయన తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందిస్తామని, పోరస్ ఘటన ప్రస్తుతం ప్రమాదం జరిగిందనే భావిస్తున్నామని, పోరస్ సంస్థ తప్పిదాలు ఏమున్నాయి..? ప్రమాదం ఎందుకు జరిగిందనే అంశాన్ని విచారణ చేపడుతున్నామన్నారు. పోరస్ ఫ్యాక్టరీ ఇక్కడ ఉంచాలా..? వద్దా..? అనేది తర్వాత మాట్లాడదామని, పోరస్ సంస్థ చాలా పెద్ద సంస్థ.. ఉపాధి కల్పిస్తోంది.. ఇలాంటివి కూడా ఆలోచన చేయాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
Revanth Reddy : తెలంగాణలో రోజురోజుకూ శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి