Site icon NTV Telugu

Medico Chaitanya: విషాదం.. పెళ్లైన రెండు నెలలకే మెడికో ఆత్మహత్య.. కారణం అదేనా?

Medico Chaitanya Suicide

Medico Chaitanya Suicide

Medico Chaitanya Commits Suicide In Nellore College Hostel: ఈమధ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆత్మహత్య ఘటనలు తరచుగా వెలుగు చూస్తున్నాయి. అందునా.. యువతే ఎక్కువగా పలు కారణాల వల్ల సూసైడ్ చేసుకుంటోంది. తమ బంగారు భవిష్యత్తుకి తామే ముగింపు పలుకుతోంది. సమస్యని ఎలా పరిష్కరించాలన్నది ఆలోచించకుండా.. చావే పరిష్కారమని భావించి, బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు తాజాగా నెల్లూరులో ఓ యువతి సూసైడ్ చేసుకుంది. మెడికల్ కాలేజీ హాస్టల్‌లో ఆత్మహత్యకు పాల్పడింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

CPI Ramakrishna: దేశ ప్రజల మధ్య విభజన రేఖ గీయడానికి.. యూసీసీ తీసుకొస్తున్నారు

నెల్లూరులోని చైతన్య అనే యువతి నారాయణ మెడికల్ కాలేజీ హాస్టల్‌లో ఉంటూ వైద్య విద్యని అభ్యసిస్తోంది. రెండు నెలల క్రితమే ఆమెకు వివాహం అయ్యింది. మొదట్లో అంతా సజావుగానే సాగింది కానీ.. ఇంతలోనే ఆ యువతి కాలేజీ హాస్టల్‌లో బలవన్మరణానికి పాల్పడింది. ఆదివారం (02-07-23) ఉదయం కళాశాల హాస్టల్‌ గదిలో సూసైడ్ చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే రంగంలోకి దిగారు. హాస్టల్‌కు చేరుకొని, ఆమె మృతదేహాన్ని అదుపులోకి తీసుకొని, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అలాగే.. చైతన్య ఉన్న హాస్టల్ గదిని సైతం క్షుణ్ణంగా పరిశీలించారు.

Kakani Govardhan Reddy: లోకేష్ పాదయాత్ర ఒక సర్కస్ కంపెనీ.. మీడియా కోసమే వివాదాస్పద వ్యాఖ్యలు

ప్రాథమిక విచారణలో భాగంగా.. కుటుంబ కలహాల కారణంగానే చైతన్మ ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు భావిస్తున్నారు. అయితే.. సరైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పెళ్లైన రెండు నెలలకే చైతన్య సూసైట్ చేసుకోవడంతో.. కచ్ఛితంగా బలమైన కారణం ఉండనే ఉంటుందని పోలీసులు అనుకుంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలిని శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన యువతిగా గుర్తించారు.

Exit mobile version