Site icon NTV Telugu

MLC Anantha Babu: కాకినాడ జీజీహెచ్‌లో ఎమ్మెల్సీకి వైద్య పరీక్షలు

Ycp Mlc

Ycp Mlc

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ అలియాస్ అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అరెస్ట్ చేసిన అనంతరం రహస్య ప్రదేశంలో పోలీసులు అనంతబాబును విచారించారు. విచారణలో భాగంగా ఆయనకు కాకినాడ జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. కాకినాడ జిల్లా కోర్టుకు వేసవి సెలవులు కావడంతో స్పెషల్ మొబైల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ జడ్జి చల్లా జానకి ముందు అనంత బాబును హాజరుపరుస్తామని దిశ డీఎస్పీ మురళీమోహన్ తెలిపారు.

MLC Anantha Babu: సుబ్రహ్మణ్యం బ్లాక్‌మెయిల్ చేశాడు.. అందుకే..!!

కాగా పోలీసుల విచారణలో సుబ్రహ్మణ్యంను తానే హత్య చేసినట్టు ఎమ్మెల్సీ అనంతబాబు ఒప్పుకున్నారు. తన వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకున్నందుకే సుబ్రహ్మణ్యంను హత్య చేసినట్టు ఎమ్మెల్సీ వివరణ ఇచ్చారు. తనను బ్లాక్ మెయిల్ చేయడంతో బెదిరిద్దామని అనుకున్నానని… కొట్టి బెదిరిద్దాం అని భావించానని.. అయితే తాను ఆవేశంతో కొడితే సుబ్రహ్మణ్యం చనిపోయాడని ఎమ్మెల్సీ అనంత్‌బాబు తెలిపారు.

Exit mobile version