ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్.. రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్‌ల రూపకల్పనకు చర్యలు చేపట్టింది.. ప్రతి ఆలయానికి ఆ ఆలయ సంప్రదాయాలు పాటిస్తూ.. భక్తులకు సౌకర్యాలు, అభివృద్ధి పనులు చేపట్టేలా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది.. వచ్చే 40 ఏళ్ల అవసరాలు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాన్‌కు రూపకల్పన చేయనున్నారు. తొలి దశలో దేవదాయ శాఖ పరిధిలోని 8 ప్రధాన ఆలయాలతో సహా 25 దేవాలయాలకు మాస్టర్‌ప్లాన్ రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే కాగా.. బెజవాడ కనకదుర్గమ్మ వారి ఆలయ అభివృద్ధికి మాష్టార్ ప్లాన్ సిద్ధం అయ్యిందని వెల్లడించారు దేవాదాయ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ.. రాజగోపురం వరకు ఏడు అంతస్తులు మెట్ల డిజైన్, ఫ్లై ఓవర్ ప్రతిపాదన చేశామన్నారు.. ఫ్లై ఓవర్ లో ఐదు లైన్లు ఉంటాయి.. 2 లక్షల మంది భక్తులు వచ్చినా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.
Read Also: Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
ఇక, 1500 మంది ఒకేసారి భోజనం చేసే విధంగా డైనింగ్ హాల్ ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ.. ఈ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తాం.. సీఎం అనుమతితో కొత్త సంవత్సరం పనులు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు.. రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల్లో నాలుగైదు కంపెనీల ద్వారా మాస్టర్ ప్లాన్‌లు సిద్ధం చేస్తున్నామన్నారు.. సీవీఆర్ఈ, ఇండియా హెరిటేజ్ కంపెనీల సేవలను మాస్టర్ ప్లాన్ తయారీకి ఉపయోగించుకోనున్నామని తెలిపారు దేవాదాయ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ.
