Site icon NTV Telugu

AP Police Department: పోలీస్ శాఖలో ప్రక్షాళన… వారందరికీ స్థాన చలనం

Ap Police

Ap Police

AP Police Department: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి పోలీసు శాఖలో భారీ ప్రక్షాళన జరగబోతోంది.. మూడేళ్లకు మించి ఒకే చోట పని చేసినవారికి స్థాన చలనం తప్పదు.. ఈ మేరకు యూనిట్ ఆఫీసర్లకు మెమో జారీ చేశారు ఏపీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి.. అయితే, చాలా చోట్ల కొందరు పోలీసులు ఐదేళ్లకు మించి ఒకే చోట పని చేస్తున్నట్టు డీజీపీ కార్యాలయం గుర్తించింది… దీంతో, మూడేళ్లకు మించి ఒకే చోట పని చేయడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది.. మూడేళ్లు ఒకే చోట పని చేసే వాళ్లను బదిలీ చేసి.. ఆ వివరాలను తెలపాలని యూనిట్ ఆఫీసర్లకు జారీ చేసిన మెమోల్లో పేర్కొన్నారు డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి.. దీని ప్రకారం.. ఏపీలో పోలీసు శాఖలో భారీగా బదిలీలు అయ్యే అవకాశం ఉంది..

Read Also: Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

మరోవైపు.. పోలీసు శాఖలో 6511 పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది.. 411 ఎస్ఐ ఉద్యోగాలు కాగా, 6100 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నవంబర్ 30 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అప్లికేషన్ కు ఆఖరి తేదీ డిసెంబర్ 28గా పెట్టారు.. అయితే, నిరుద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే వారి గరిష్ట వయోపరిమితి రెండేళ్లు సడలించింది సర్కార్.. ఈ నిర్ణయం వల్ల చాలామంది ఈ ఉద్యోగాలకోసం పోటీపడేందుకు అవకాశం ఉండడంతో.. ఆశావాహులందరూ దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా కానిస్టేబుల్ పోస్టుల దరఖాస్తు గడువుని 2023, జనవరి 7వ తేదీ వరకు పొడిగించిన విషయం విదితమే.

Exit mobile version