Site icon NTV Telugu

Minister AppalaRaju: మంత్రి సీదిరి అప్పలరాజుకి భద్రత పెంపు

మావోయిస్టుల లేఖ నేపథ్యంలో మంత్రి సీదిరి అప్పలరాజు (Sidiri AppalaRaju)కి భద్రత పెంచారు. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో భూములు కబ్జా పెరుగుతోందని ఆరోపిస్తూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారంటూ పుకార్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఏవోబీ స్పెషల్ జోన్ మావోయిస్టు కమిటీ పేరుతో లేఖ విడుదలైనట్టు సమాచారం. దీనిపై స్పందించిన మంత్రి అప్పలరాజు తనపై వస్తున్న వార్తలను ఖండించారు. మంత్రి అప్పలరాజు పై మావోయిస్టుల విడుదల చేసిన లేఖపై అప్రమత్తమయ్యాయి ఇంటెలిజెన్స్ వర్గాలు.

Read Also: Celebrations of Venkateswara Swamy: నేటి నుంచే వైభవోత్సవాలు.. ఎన్టీఆర్ స్టేడియంలో ఐదురోజులు

పలాస మండలం రామకృష్ణాపురం రెవెన్యూ విలేజ్ పరిధిలో 30 ఎకరాల భూములకు సంబంధించి దువ్వాడ శ్రీధర్ కుటుంబీకుల నుంచి వివరాలు సేకరించాయి నిఘా వర్గాలు. పలాసలోని జిఎంఈ కాలనీలో నివాసముంటున్న మంత్రి అప్పలరాజుకు ప్రస్తుతం ఉన్న భద్రతపై విజయవాడ కు చెందిన ఇంటెలిజెన్స్ ‌సెక్యూరిటీ వింగ్ డిఎస్పీ కృపాకర్ ఆరా తీశారని సమాచారం. మంత్రి ఇల్లు, కార్యాలయం పరిసరాలు పరిశీలించారు. ఎలాంటి అనుమానాస్పద అంశాలున్నా వెంటనే తమకు తెలపాలని ఇంటెలిజెన్స్ వర్గాలు కోరాయి. మావోయిస్టుల లేఖ నేపథ్యంలో మంత్రి సీదిరికి భద్రత పెంపు పై ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించనున్నట్లు సమాచారం. తనపై కొందరు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ.. అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి అప్పలరాజు మండిపడ్డారు.

Read Also: Manickam Tagore: నేడు నగరానికి మాణిక్కం ఠాగూర్‌.. జోడో యాత్ర ముగిసే వరకు రాష్ట్రంలో

Exit mobile version