NTV Telugu Site icon

కిడారి, సోమ మర్డర్‌ కేసులో కీలక పరిణామం

ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మర్డర్‌ కేసులో కీలక నిందితుడైన మావోయిస్టు కమాండర్‌ను ఒడిశా పోలీసులు అరెస్ట్‌ చేశారు. మెదక్‌ జిల్లా దౌల్తాబాద్‌ మండలం ముత్తరాసిచెట్లకు చెట్లకు చెందిన దుబాసి శంకర్‌ అలియాస్‌ రమేశ్‌ను అరెస్ట్‌ చేశారు ఒడిశా పోలీసులు. రెండు రోజుల కిందట పేటగూడ, నౌరా గ్రామాల అటవీ ప్రాంతంలో DVF, NOG, BSF సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో రమేశ్‌ పట్టుబడ్డాడు. సోమవారం ఉదయం నిర్వహించిన కార్డాన్‌ సెర్చ్‌లో.. హార్డ్‌కోర్‌ మావోయిస్ట్‌ దుబాసి శంకర్‌ను పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. అతని దగ్గర ఒక రైఫిల్‌, పదిరౌండ్ల బుల్లెట్లు, ఒక మొబైల్‌ ఫోన్‌, ఒక రేడియో, 35 వేల 500 నగదును స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. 1987లో ఇంద్రపురియాల్‌ ఏరియా కమిటీలో సభ్యుడైన రమేశ్‌పై 20 లక్షల రూపాయల రివార్డు ఉంది. ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమ హత్యకేసులో శంకర్‌పై NIA కేసు నమోదు చేసింది.