NTV Telugu Site icon

Trains Cancelled: ఏపీ, తెలంగాణా రైలు ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు రద్దు

South Central Railway

South Central Railway

Many trains canceled in AP and Telangana: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన విడుదల చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణించే కొన్ని రైళ్లను రద్దు చేయగా మరికొన్నింటిని దారి మళ్లించారు. పలు ప్రాంతాల మధ్య పలు రైళ్లు పాక్షికంగా రద్దు చేయబడ్డాయి. ఇందుకు సంబంధించిన వివరాలను దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. నిర్వహణ పనుల దృష్ట్యా హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లలో పలు రైళ్లను రద్దు చేశారు. 25న కర్నూలు సిటీ-సికింద్రాబాద్ (17024) రైలు 90 నిమిషాలు, గుంతకల్లు-బోధన్ (07671) రైలు 26, 27, 30 తేదీల్లో 120 నిమిషాలు రీషెడ్యూల్ చేశారు.

Read also: Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

24 నుంచి 30వ తేదీ వరకు దండి-నిజామాబాద్ (11409) రైలు ముద్ఖేడ్-నిజామాబాద్, 25 నుంచి 31వ తేదీ వరకు నిజామాబాద్-పందర్‌పూర్ (01413) రైలు నిజామాబాద్-ముద్ఖేడ్ మధ్య రద్దు చేశారు. కాచిగూడ-నిజామాబాద్ (07596), నిజామాబాద్-కాచిగూడ (07593), నాందేడ్-నిజామాబాద్ (07854) రైళ్లు 24 నుంచి 30 వరకు, నిజామాబాద్-నాందేడ్ (07853) రైళ్లను 3215 నుంచి రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. కడగలపాలెం-శావల్యాపురం మధ్య ఇంటర్‌లింకింగ్‌ పనులు జరగకపోవడంతో ఈ నెల 31 నుంచి ఈ నెల 3వ తేదీ వరకు పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. గుంటూరు-తిరుపతి (17261) రైలు మార్కాపురం-తిరుపతి మధ్య మాత్రమే నడుస్తుందని ప్రకటించారు.
Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

Show comments