NTV Telugu Site icon

Manchu Mohan Babu: మరో వివాదంలో మంచు మోహన్‌బాబు.. ఈ సారి షిర్డీ సాయినాథునిపై..!

Manchu Mohan Babu

Manchu Mohan Babu

టాలీవుడ్‌ సీనియర్‌ హీరో, విల‌క్ష‌ణ న‌టుడు మంచు మోహన్‌బాబు మరో వివాదంలో చిక్కుకున్నారు.. షిర్డీ సాయినాథునిపై ఆయన చేసిన వ్యాఖ్యలే తాజా వివాదానికి కారణంగా మారాయి.. చంద్ర‌గిరి మండ‌లం రంగంపేట‌లో ద‌క్షిణాదిలోనే అతి పెద్ద‌దైన సాయి బాబా గుడిని నిర్మించారు. ఆ గుడికి సంబంధించి విగ్ర‌హ ప్ర‌తిష్ట కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు మోహన్ బాబు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ గుడి ద‌క్షిణాదిలోనే అతి పెద్దద‌ని ఇదొక అద్భుతం. నా దృష్టిలో ఇక భ‌క్తులు షిర్డీ సాయినాథుని ఆల‌యానికి వెళ్ల‌న‌క్క‌ర్లేదు అని వ్యాఖ్యానించారు.. షిర్డీపై మోహన్‌బాబు చేసిన కామెంట్లపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు భక్తులు..

Read Also: Munugode ByPoll : దుబ్బాక, హుజురాబాద్ ఫలితాలతో గులాబీ పార్టీ గుణపాఠం నేర్చుకుందా?

ఇక, ఈ గుడి క‌ట్టాల‌నుకున్న‌ప్పుడు విష్ణు బాబు ఒక మాట అన్నాడు… వెంకటేశ్వర స్వామి సన్నిధికి వచ్చిన భక్తులందరూ ఈ గుడికి రావాలి.. అలా కడితే కట్టండి లేకపోతే లేదు అన్నాడని గుర్తుచేసుకున్నారు మోహన్‌బాబు.. అలాగే కట్టానని అనుకుంటున్నాను. మహాద్భుతంగా కట్టాం. రుషికేష్ నుంచి దాదాపు 110 సంవత్సరాలకు పైనున్న యోగి సహా యోగులు, రుషీశ్వరులు నుంచి చెక్కలు, ఆయన లిపితో రాసిన కొన్ని అమూల్యమైన మూలికలు తీసుకొచ్చి ఆలయంలో పెట్టామన్నారు.. ఇదంతా నా ఒక్క‌డి కోసమే కాదు.. విద్యాలయం, ప‌క్క గ్రామాలు, రెండు తెలుగు రాష్ట్రాలు, యావ‌త్ భార‌త‌దేశం నెంబ‌ర్ వ‌న్‌గా ఉండాల‌ని, అంద‌రూ క్షేమంగా ఉండాల‌ని ఈరోజు ప్రారంభించామని తెలిపారు.. అయితే, అదంతా ఎలా ఉన్నా.. సాయి భక్తులు ఇకపై షిర్డీకి వెళ్లనవసరం లేదని మోహన్‌బాబు చేసిన వ్యాఖ్యలపై నెటిజన్స్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కాగా, చంద్ర‌గిరి మండ‌లం రంగంపేట‌లో ద‌క్షిణాదిలోనే అతి పెద్ద‌దైన సాయి బాబా గుడిని నిర్మించారు మోహన్‌బాబు… మంగ‌ళ‌వారం ఆ గుడికి సంబంధించి విగ్ర‌హ ప్ర‌తిష్ట కార్య‌క్ర‌మం జ‌రిగింది. మోహ‌న్ బాబు దంప‌తులు, విష్ణు, మ‌నోజ్, ల‌క్ష్మీ ప్ర‌స‌న్న‌ ఇలా మంచు ఫ్యామిలీ మొత్తం ఆ కార్యక్రమంలో పాల్గొంది..