Sathyasai District: వైరల్ వీడియో.. పోలీస్ స్టేషన్లో యువకుడిపై ఎస్సై దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సత్యసాయి జిల్లా చిలమత్తూరు పోలీస్ స్టేషన్లో ఓ ఎస్సై రెచ్చిపోయాడు. ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఓ యువకుడిని చితకబాదాడు. దీంతో ఎస్సై దాడి చేసిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళ్తే.. తన తల్లి వికలాంగురాలు అని.. ఆమెకు వికలాంగురాలి పెన్షన్ మంజూరు చేపిస్తానని చెప్పి స్థానిక వైసీపీ నేత దామోదర్ రెడ్డి డబ్బు తీసుకుని మోసం చేశాడని బాధితుడు వేణు ఆరోపించాడు. వైసీపీ నేత దామోదర్ రెడ్డిని ప్రశ్నించేందుకు వెళ్లిన సమయంలో తనపై దాడి చేసి అక్రమ కేసు బనాయించారని వాపోయాడు. ఇదే విషయాన్ని చిలమత్తూరు ఎస్ఐ రంగడు దృష్టికి తీసుకెళ్లేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్తే తనపై దాడి చేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు.
అయితే పోలీసుల వాదన మరోలా ఉంది. మద్యం మత్తులో ఉన్న వేణు సంజీవరాయనిపల్లెలో న్యూసెన్స్ చేస్తుండగా కానిస్టేబుల్ అడ్డుపడ్డాడని.. అడ్డుపడ్డ కానిస్టేబుల్‌పై వేణు తిరగబడ్డాడని.. ఈ విషయంలోనే తాము మందలించామని పోలీసులు చెప్తున్నారు. కాగా యువకుడిపై ఎస్సై దాడి చేసిన వీడియో బయటకు రాగా ఈ ఘటనపై ఎస్పీ విచారణకు ఆదేశించారు. పెనుకొండ డీఎస్పీ రమ్యను విచారణ అధికారిగా నియమించారు.
Also Read
తాజావార్తలు
-
MK Stalin: “విజయ్ ప్రభుత్వం డీఎంకే దయపైనే”.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
-
Hyderabad: మాదాపూర్‌లో అర్ధరాత్రి బైకులు, కార్లతో రేసర్ల హంగామా.. పోలీసులు ఏం చేశారో చూడండి..
-
Motorola Edge 50 Ultra 5G: మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5G పై రూ.26000 డిస్కౌంట్.. 64MP టెలిఫోటో కెమెరా, pOLED డిస్ప్లే
-
AR Rahman Peddi: ‘బాహుబలి’ చూసాకే తెలుగు సినిమాపై ప్రేమ పెరిగింది..
-
SRH: ఐపీఎల్ చరిత్రలో ఆ అరుదైన ఘనత సాధించిన ఏకైక జట్టు ఎస్ఆర్హెచ్.. మళ్లీ 2016 నాటి మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?