NTV Telugu Site icon

Majji Srinivasrao: ప్రజల పక్షాన పనిచేస్తున్నాం.. విపక్షాలవి కువిమర్శలు

Vzm Srinu

Vzm Srinu

ఏపీలో ప్రభుత్వం ప్రజల పక్షాన పనిచేస్తుందన్నారు విజయనగరం జెడ్పీ ఛైర్మన్ మజ్జి చిన్ని శ్రీనివాస రావు. రహదారులు పాడైపోయాయి.. అభివృద్ధి చేయలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నారు. ముఖ్యంగా విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో పలు కార్యక్రమం చేపట్టామన్నారు. మా ప్రజాప్రతినిధులు పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి.

జిల్లాలో పలు గ్రామాలలో రోడ్డు బాగోలేవన్నది ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. 426 కిలో మీటర్ల పరిధిలో రోడ్లు 127 కోట్లతో వేయబోతున్నాం. టెండర్ల ప్రక్రియ పూర్తయింది. పనులు ప్రారంభం కాబోతున్నాయన్నారు జెడ్పీ ఛైర్మన్. 2014-19 కాలంలో టీడీపీ హయాంలో ఎన్ని రోడ్లు వేశారు? ఉపాధి హామీ పనులలో భాగంగా 64 కిలోమీటర్ల రోడ్లు వేసుకున్నాం…

ప్రభుత్వం పూర్తిగా ఉపాధి హామీ పనులను వినియోగించుకుంటుందన్నారు. చంద్రబాబు జిల్లాకి వస్తున్నారనే ప్రజలను రెచ్చగొట్టే పని చేస్తున్నట్టు ఉన్నారు. ఇది నెరవేరదని గుర్తెరగాలి… ప్రభుత్వం ప్రజల‌ పక్షాన నిలుస్తుందన్నారు. 14వందల కోట్లు రోడ్లు కోసమే వెచ్చించారని మా ముఖ్యమంత్రి చెప్పారు. పారాది బ్రిడ్జ్ రిపేర్స్ కోసం ముందుకొచ్చాం వెంటనే పరిష్కరించాం. విజయనగరం రాజాం రోడ్ల అభివృద్ధి కోసం యాభై కోట్లు అంచనా వేశారు.. అయితే తొలుత తొమ్మిది కోట్లతో మొదలు పెట్టడానికి సిద్ధపడ్డాం అన్నారు మజ్జి శ్రీనివాసరావు.

Housing For All: ప్రతి ఒక్కరికి ఇల్లు.. మోడీ విధానం అదే