NTV Telugu Site icon

Mahanadu 2022: పొత్తుల ఊసే లేకుండా టీడీపీ తీర్మానం

Tdp2

Tdp2

ప్రకాశం జిల్లాలో జరుగుతున్న టీడీపీ మహానాడు 2022 కి భారీ ఎత్తున తరలివచ్చారు టీడీపీ నేతలు, కార్యకర్తలు. ఈ సందర్భంగా టీడీపీ రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు. పొత్తుల గురించి ఎలాంటి ప్రస్తావన లేకుండానే మహానాడులో రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టడం విశేషం.

ఎప్పుడు ఎన్నికలొచ్చినా సిద్దంగా ఉండాలంటూ రాజకీయ తీర్మానంలో ప్రస్తావించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పక్కా వ్యూహాలతో వెళ్లాల్సిన అవసరం ఉందంటూ రాజకీయ తీర్మానంలో స్పష్టం చేసింది టీడీపీ. దూరమైన వర్గాలను తిరిగి దగ్గరకు చేర్చుకోవాలని తీర్మానంలో స్పష్టీకరించారు.

రాజకీయ తీర్మానంలోని అంశాలు..

* క్విట్ జగన్ – సేవ్ ఏపీ. నలభై ఏళ్ల వేడుకతో మరొకసారి కొత్త పోరాటానికి కార్యోన్ముఖులం అవుదాం.

* స్వార్ధ రాజకీయ శక్తుల కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉంది.

* చరిత్ర ఎరుగని సంక్షోభంలోకి రాష్ట్రాన్ని, ప్రజల్ని.. సమాజం ఎరుగని బాధల్లోకి నెట్టిన విధానాన్ని వివరించాలి.

* ప్రభుత్వ అసమర్థ , ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు చేయాలి.

* అంబేద్కర్, మహాత్మా గాంధీ, మహాత్మా పూలే , బాబూ జగ్జీవన్ రాం వంటి మహనీయుల ఉన్నతాశయాలకు తూట్లు పొడిచేలా జగన్ పాలన సాగుతోంది.

* తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు నాటి పరిస్థితులు నేడు రాష్ట్రంలో నెలకొన్నాయి.

* రానున్న రోజుల్లో యువత , మహిళలకు అధిక ప్రాధాన్యం. మరో వందేళ్లకు సరిపడా నాయకత్వాన్ని అందించేలా ప్రణాళికతో ముందుకెళ్లాలి.

* ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఇవ్వడం కోసం నాడు గాంధీ పోరాటం చేశారు. నేడు వైసీపీ అరాచక పాలనలో బందీ అయిన రాష్ట్రాన్ని విముక్తి చేయడానికి తెలుగుదేశం పోరాడుతోందని తీర్మానంలో పేర్కొంది టీడీపీ.