పరమ పవిత్రమయిన మహా శివరాత్రి నాడు శైవాలయాలకు పోటెత్తుతున్నారు భక్తులు. శివుడికి అభిషేకం చేసి జాగరణ వుంటే పాపాలు పోతాయని, పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా బలివే శివాలయానికి పెద్ద ఎత్తున కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాల నుండి భక్తులు పోటెత్తారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు తపన ఫౌండేషన్ చైర్మన్ గారపాటి చౌదరి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు.
రెండు ప్రసాద వితరణ కేంద్రాలను ఏర్పాటు చేయగా ఒకటి కృష్ణ జిల్లా వైపు మరొకటి పశ్చిమ గోదావరి జిల్లా వైపు ఏర్పాటు చేసి భక్తులకు పులిహార, స్వీట్ తోపాటు 50 వేల బట్టర్ మిల్క్ ప్యాకెట్లను అందించారు. ప్రతి ఏటా శివరాత్రి కి తపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో బలివే ఆలయంలో భక్తుల కోసం ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ఏడాది స్థానికుల విజ్ఞప్తి మేరకు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు.
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నుంచి చింతలపూడి వెళ్ళే దారిలో విజయరాయి సమీపంలో బలివే ఆలయం వుంది. ఏటా వేలాదిమంది ఈ ఆలయానికి తరలివస్తుంటారు. ఏలూరు నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం వుంది.