కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోన్న సమయంలో.. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య తయారు చేస్తున్న కరోనా మందుపై పెద్ద చర్చే జరిగింది.. ప్రభుత్వం జోక్యం చేసుకోవడం.. ఆ మందను పరిశీలించడం.. వ్యవహారం హైకోర్టు వరకు వెళ్లడం.. ప్రభుత్వం ఆనందయ్య మందుకు అనుమతి ఇవ్వడం అన్నీ జరిగిపోయాయి.. అయితే, తాజాగా.. ఆనందయ్య మందుపై మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనాకు మందు తయారుచేసి ఉచితంగా ఇస్తున్నారంటూ ఆనందయ్యను అభినందించింది మద్రాసు హైకోర్టు.. ఆనందయ్యకు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్. కరుబాకరణ్, టీవీ తమిళ్ సెల్వీ సెల్యూట్ చేశారు. ఇంతకీ ఆనందయ్య గురించి కోర్టుకు చర్చ ఎందుకు వచ్చిదంటే.. ఇవాళ.. డీఆర్డీవో తయారు చేసిన 2-డీజీ మందుపై విచారణ జరిపింది మద్రాసు హైకోర్టు.. ఈ సందర్భంగా ఆనందయ్య మందు ప్రస్తావన వచ్చింది. ఆనందయ్యపై అభినందనల వర్షం కురిపించిన కోర్టు.. ఆయుర్వేద వైద్యులను ప్రోత్సహించాలని పేర్కొంది. ఇక, భారతీయ ఎడిసన్‌గా పేరుపొందిన జీడీ నాయుడును గుర్తు చేసిన హైకోర్టు.. అలాంటి అత్యుత్తమ ఆవిష్కర్తలు కూడా ఉంటారని.. అందరూ రామర్ పిళ్లై లాంటి మోసగాళ్లే ఉంటారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.. కాగా, కరోనా మందు కోసం కృష్ణపట్నం రావాల్సిన అవసరం లేకుండా.. ఆయా జిల్లాలకు, రాష్ట్రాలకు సైతం ఆనందయ్య మందు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఆనందయ్యకు మద్రాసు హైకోర్టు సెల్యూట్

Madras High Court