NTV Telugu Site icon

Madanapalle Incident: మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో ఫైళ్ల దగ్ధంపై కొనసాగుతున్న విచారణ

Madanapalle

Madanapalle

Madanapalle Incident: మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్గంపై విచారణ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఘటనపై విచారణ కోసం మదనపల్లెకు మరికొందరు ఉన్నత స్థాయి అధికారులు వెళ్లనున్నారు. ఘటనపై విచారించేందుకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియాను వెళ్లమని ఆదేశాలు జారీ అయ్యాయి. ఫైర్ సేఫ్టీ డైరెక్టర్, ఏపీ జెన్కో సీఎండీలను కూడా ఘటనా స్థలానికి వెళ్లి తమ శాఖలకు సంబంధించిన అంశాలపై విచారణ జరపమని ప్రభుత్వం ఆదేశించింది. నాగపూర్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఫైర్ సేప్టీ ఇంజరీంగ్ సంస్థ నుంచి నిపుణులను ప్రభుత్వం పిలిపించనుంది. ఫైళ్ల దగ్దంలో కుట్రను తేల్చేందుకు అన్ని మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది. చిన్న ఆధారం దొరికినా వదలకుండా ఘటనకు పాల్పడిన వారిని పట్టుకోవాలనే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది.

Read Also: Union Budget 2024 LIVE UPDATES: కేంద్ర బడ్జెట్ 2024.. లైవ్‌ అప్‌డేట్స్

మరో వైపు మంటల్లో సగం కాలిన ఫైల్స్‌ను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాత్రంతా రెవెన్యూ డివిజన్‌లోని తహసీల్దార్ కార్యాలయల్లో తనిఖీలు చేశారు. కార్యాలయాల నుంచి మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి దరఖాస్తులు, సర్టిఫికెట్లు, భూములకు సంబందించిన రికార్డులు ఏమేమి పంపించారో ఆరా తీస్తున్నారు.