Pinnelli Ramakrishna Reddy: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఓటమి అంటే తెలియని రాజకీయ చరిత్ర నాదన్న పిన్నెల్లి.. 2004 నుంచి 2024లో కూడా విజయం నాదేనని ధీమా వ్యక్తం చేశారు.. 2024లో నన్ను ఓడించగలిగితే నేను రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని ప్రకటించారు.. నా మీద నలుగురు అభ్యర్థులను టీడీపీ నాయకులు రంగంలోకి దించారు.. అందరూ నా చేతిలో ఓడిపోయిన వారేన్న ఆయన.. మాచర్లలో జరుగుతున్న ప్రతి చిన్న సంఘటన రాజకీయంగా నాపై రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. తెలుగుదేశం పార్టీ నేతలు బెదిరింపులు చూసి ఇక్కడ ఎవరూ బెదిరిపోయే వాళ్లు లేరంటూ వార్నింగ్ ఇచ్చిన పిన్నెల్లి.. జరుగుతున్న అభివృద్ధిపై అంకెలతో సహా చర్చకు సిద్ధం అంటూ సవాల్ విసిరారు.
Read Also: AP Special Status: ఏపీకి ప్రత్యేక హోదా.. కట్టుబడి ఉన్నామని ప్రకటన
తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న మాచర్ల నియోజకవర్గంలో 930 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు పేదలకు అందించామని ప్రకటించారు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం అని వెల్లడించారు.. టీడీపీ నేతలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.. ఇక, మిరియాల గ్రామంలో జరిగిన ట్రాక్టర్ దగ్ధం ఘటన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధం లేదని స్పష్టం చేశారు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. కాగా, రామకృష్ణా రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు.. 1996లో యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి పదవీ చేపట్టిన ఆయన.. మొదట వెల్దుర్తి జెడ్పీటీసీగా పని చేశాడు. ఆతర్వాత మాచర్ల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పై 9785 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు.. ఇక, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణాంతరం తన పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సాఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చిరుమామిళ్ల మధుబాబుపై 16200 ఓట్ల మెజారిటీతో రెండోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. 2014, 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సాఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు 2019లో వైఎస్సాఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక పిన్నెల్లిని ప్రభుత్వ విప్‌గా నియమించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.