NTV Telugu Site icon

Love Marriage at YSP Office: ప్రేమికులను కలిపిన ఎమ్మెల్యే.. వైసీపీ కార్యాలయంలో పెళ్లి..

Love Marriage

Love Marriage

ఓ యువతి, యువకుడు ప్రేమించుకున్నారు.. అయితే, వారి పెళ్లికి పెద్దలు నిరాకరించారు.. దాని కారణం.. వారు వేర్వేరు కులాలకు చెందినవారు కావడమే.. అయితే, ఆ ప్రేమికులు మాత్రం.. విడిచి బతకలేక.. పెద్దలను కాదనలేక తీవ్ర ఆవేదనతో ఉన్నారు.. అవకాశం దొరికినప్పుడల్లా కలుస్తూనే ఉన్నారు.. ఈ విషయం గ్రామ పెద్దల వరకు వెళ్లింది.. వారు చెప్పినా.. ఆ ప్రేమ జంట మాత్రం వెనక్కి తగ్గలేదు.. గ్రామ పెద్దల ద్వారా స్థానిక ఎమ్మెల్యేలకు ఈ వ్యవహారం తెలిసింది.. ఇక, తల్లదండ్రులను ఒప్పించిన ఎమ్మెల్యే.. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలోనే.. వారికి పెళ్లి జరిపించారు.. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

Read Also: Bridge Collapses: బీహర్‌లో కుప్పకూలిన బ్రిడ్జి.. ప్రారంభానికి ముందే ఇలా..

అనపర్తి మండలం లక్ష్మీ నరసాపురానికి చెందిన లంకలపూడి దుర్గామల్లేష్, విజయ మధ్య పరిచయం ఏర్పడింది.. అదికాస్తా ప్రేమగా మారింది.. అయితే, వారి ప్రేమ వ్యవహారం ఇరువురి తరుపు తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో.. ఈ విషయం కాస్తా గ్రామ పెద్దల వరకు వెళ్లింది.. పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగినప్పటికీ.. యువతీ యువకులు ఇరువురు తమ ప్రేమ వ్యవహారాన్ని కొనసాగిస్తూ వచ్చారు. దీంతో.. ఈ వ్యవహారాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు గ్రామ పెద్దలు.. ఈ ఘటనలో జోక్యం చేసుకున్న ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి.. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలని ఒప్పించి.. గ్రామ పెద్దలు, కుటుంబసభ్యుల సమక్షంలో ఆ ప్రేమికులను ఒక్కటి చేశారు.. అనపర్తిలోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం ఈ ప్రేమ పెళ్లికి వేదికైంది.. వైసీపీ కార్యాలయంలో ప్రేమ జంటను దండలు మార్పించారు ఎమ్మెల్యే.. ఆ తర్వాత ఎమ్మెల్యే కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకుంది ప్రేమ జంట.. ఇక, ఈ పెళ్లికి లక్ష్మీ నరసాపురం గ్రామ పెద్దలు.. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు, కొంతమంది బంధువులు హాజరయ్యారు.

Show comments