Lokesh : పవన్ అన్న అంటూ లోకేష్ ట్వీట్.. మంత్రి స్పెషల్ విషెస్

  • జనసేన అద్భుతాలు సాధించాలి
  • ఆ పార్టీ సహకారం గొప్పది
  • లోకేష్ స్పెషల్ ట్వీట్
Lokesh

Lokesh

Lokesh : జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి లోకేష్ స్పెషల్ ట్వీట్ వేశారు. పవన్ అన్నకు అంటూ ఆప్యాయంగా స్పందించారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ అన్నకు ప్రత్యేక శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చారు. ఏపీ అభివృద్ధిలో జనసేన పనితీరు ఎంతో కీలకం అన్నారు. ఆ పార్టీ కమిట్ మెంట్ ఏపీ అభివృద్ధికి చాలా కీలకం అన్నారు.

Read Also : CM Chandrababu : జనసేనకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలుః సీఎం చంద్రబాబు

భవిష్యత్ లో ఆ పార్టీ మరిన్ని అద్భుతాలు సాధించాలని కోరుకుంటున్నట్టు వివరించారు. కూటమి ప్రభుత్వ పనితీరులో జనసేన సహకారం అత్యంత కీలకం అంటూ చెప్పుకొచ్చారు. లోకేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. పవన్ కల్యాణ్‌ ను లోకేష్ ఇలా స్పెషల్ గా పిలవడంపై జనసైనికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురంలో ఆవిర్భావ సభ ప్రారంభం అయింది.