NTV Telugu Site icon

తూర్పుగోదావరిలో మళ్లీ లాక్‌డౌన్..!

Lockdown

Lockdown

ఏపీలో దాదాపు అన్ని జిల్లాలో కరోనా కేసులు తగ్గాయి. కాని తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం కేసులు అదుపులోకి రావడం లేదు. దీంతో కారణాలపై ప్రభుత్వం ఆరా తీస్తుండడంతో అధికారులు ఇప్పుడు పరుగులు తీస్తున్నారు. గడచిన కొన్ని వారాలుగా పాజిటివ్ జిల్లా తొలి స్థానంలో కొనసాగుతుండడంతో ఎందుకిలా అనే దానిపై సమీక్ష నిర్వహిస్తున్నారు. గడిచిన ఇరవై రోజుల్లో జిల్లాలో 10,944 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కర్ఫ్యూ వేళలు పొడిగించారు. చింతూరు, పి.గన్నవరం మండలాల్లో మధ్యాహ్నం రెండు నుంచి మర్నాడు ఉదయం ఆరు గంటల వరకూ కర్ఫ్యూ విధించారు. ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకే దుకాణాలు తెరుచుకోవడానికి అనుమతి ఇచ్చారు. వారాంతపు సంతలు పూర్తిగా నిలిపి వేశారు. అనవసరంగా రోడ్లపై తిరగవద్దని హెచ్చరించారు పోలీసులు.

జిల్లాలో పలు మండలాలు కరోనాకు హాట్‌స్పాట్‌గా మారాయి.. దీంతో తిరిగి జిల్లాలో లాక్ డౌన్ అమలుకు యంత్రాంగం సిద్దపడుతోంది. అయితే జిల్లా మొత్తం ఒక యూనిట్‌గా కాకుండా పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న మండలాల వారీగా లాక్‌డౌన్‌ అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా పి గన్నవరం మండలంలో తిరిగి లాక్‌డౌన్‌ విధించారు. . అలాగే రాజమండ్రిలో కూడా కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయ్‌. లాక్‌డౌన్‌ సడలింపులు తర్వాత ఈ రెండు నగరాల్లోనూ మార్కెట్లకు జనం పోటెత్తుతున్నారు. దుకాణాలు, మాల్స్ రద్దీగా మారాయ్‌. ఇందుకు తగ్గట్లే ఈ నగరాల్లో కొత్త కేసులు నమోదు అధికంగా ఉంది. కేసుల సంఖ్య అదుపులోకొచ్చే వరకు కొత్త నిబంధనలు అమలవుతాయని అంటున్నారు అధికారులు.