NTV Telugu Site icon

Loan Apps Harassments Death: ఆగని లోన్ యాప్ వేధింపులు.. యువకుడు బలి

Knl Loan App Student Death (3)

Knl Loan App Student Death (3)

ఎన్ని చట్టాలు వచ్చినా, ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. లోన్ యాప్ వేధింపులకు మరొక యువకుడు బలయ్యాడు. నంద్యాలకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి వీరేంద్రనాథ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. లోన్ కట్టకపోతే కేసు పెట్టి అరెస్టు చేయిస్తామని బెదిరించడంతో ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు వీరేంద్రనాథ్.. కన్న కొడుకు దూరం కావడంతో కుప్పకూలిపోయారు తల్లిదండ్రులు మల్లికార్జున, లక్ష్మీదేవి..

Read Also: KRJ Bharath: ఏపీ శాసనమండలి ఛైర్మన్‌గా కుప్పం వైసీపీ నేత.. ఫోటో వైరల్..!!

నంద్యాల పట్టణంలోని గుడిపాటి గడ్డ ప్రాంతానికి చెందిన ఎలక్ట్రికల్ వ్యాపారి మల్లికార్జున చిన్న కొడుకు వీరేంద్రనాథ్. తండ్రితో పాటు వ్యాపారం చేస్తున్నారు ఇద్దరు కొడుకులు విశ్వనాధ్, కేదార్నాథ్. వీరేంద్రనాథ్ చిన్న కొడుకు కావడంతో ప్రేమగా చూసుకునేవారు మల్లికార్జున దంపతులు. బెంగళూరులోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించారు. ప్రస్తుతం బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు వీరేంద్రనాథ్. కానీ 2 సబ్జెక్టులు తప్పాడు. విషయం తెలియడంతో మళ్లీ ఫీజులు కట్టి వీరేంద్రనాథ్ కు ధైర్యం చెప్పాడు తండ్రి మల్లికార్జున్.

వీరేంద్రనాథ్ ఎప్పుడూ దిగాలుగా ఉండడంతో తండ్రి మల్లికార్జున పదేపదే అడిగిన సమాధానం చెప్పలేదు. రెండు రోజుల క్రితం లోన్ యాప్ నిర్వాహకుల నుంచి మెసేజ్ వచ్చింది. తీసుకున్న డబ్బులు కట్టాలని లేకపోతే అరెస్టు చేయిస్తామని వార్నింగ్ ఇచ్చింది లోన్ యాప్ సంస్థ. అసభ్యకరమైన పోస్టర్ ఫోటోను కూడా లోన్ సంస్థ పంపింది. దీని గురించి మల్లికార్జున అడగ్గా అదంతా ఫేక్ అని చెప్పాడు వీరేంద్రనాథ్. కానీ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. లోన్ యాప్ వల్లనే వీరేంద్రనాథ్ ప్రాణాలు తీసుకున్నాడని ఆరోపించారు తండ్రి మల్లికార్జున..అసభ్యకరమైన పోస్టింగులు పెట్టారాన్నారాయన. లోన్ యాప్ నుంచి వీరేంద్రనాథ్‌ 5వేలు తీసుకున్నాడని, వెంటనే చెల్లించాలని అతని ఫ్రెండ్స్ కు కూడా మెసేజ్ లు పెట్టారు. లోన్ యాప్ నిర్వాహకులపై చర్యలు తీసుకోకుంటే ఇంకా ఎంతోమంది యువకులు బలయిపోతారు.

Read Also: Thank God: బాలీవుడ్ సినిమాకి షాక్.. బ్యాన్ విధించిన ప్రభుత్వం