Site icon NTV Telugu

Sajjala: చంద్రబాబు హయాంలో జరిగింది లిక్కర్ స్కాం.. మిథున్ రెడ్డి అరెస్ట్ అక్రమం!

Sajjala

Sajjala

Sajjala: లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి.. విజయవాడలోని ఏసీబీ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్న ఎంపీ మిథున్ రెడ్డికి మద్దతుగా వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో జరిగింది లిక్కర్ స్కాం అన్నారు. ఇప్పుడు లిక్కర్ స్కాం అంతా ఊహాజనితమే అని పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవు.. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో సుమారు రూ. 40 వేలకు పైగా బెల్ట్ షాపులు పెట్టి, రాష్ట్రంలో మద్యం ఏరులై పారించారు.. టీడీపీ నేతలే సిండికేట్ గా ఏర్పడి మద్యం షాపులు నడుపుతున్నారు అని వైసీపీ రాష్ట్ర కార్యాదర్శి సజ్జల అన్నారు.

Read Also: JUNIOR : వైరల్ వయ్యారి కోసం కిరీటి ఎంత కష్టపడ్డాడో.. వీడియో వైరల్

ఇక, లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికీ చంద్రబాబు నిందితుడిగా ఉన్నారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మిథున్ రెడ్డి అరెస్ట్ కసోం చంద్రబాబు ప్రభుత్వం కల్పిత ఆధారాలను సృష్టిస్తోంది అని ఆరోపించారు. కార్పొరేషన్ లో గవర్నమెంట్ పాత్ర ఏముంటుందని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా చూపించలేదని అన్నారు. ఇల్లీగల్ అరెస్టులపై కోర్టుల్లో పోరాడుతామన్నారు. చంద్రబాబు పాలన కంటే మా హయాంలో మద్యం వినియోగం తగ్గింది.. రూ. 50 వేల కోట్లు అని మొదట అన్నారు.. ఇప్పుడు 3 వేల కోట్లు అంటున్నారు.. 3 వేల కోట్లను 30 రకాలుగా చెప్తున్నారు.. డబ్బు ఎక్కడుందంటే.. మాత్రం ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు.. టీవీ సీరియల్ లాగా సాగదీస్తున్నారు అని సజ్జల మండిపడ్డారు.

Read Also: Airtel OTT Plans: ఈ ప్లాన్స్ తో రీఛార్జ్ చేసుకుంటే.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్ ఫ్రీ

అయితే, ప్రజల నుంచి వచ్చే ప్రశ్నలు తప్పించుకోవడానికి తమపై అక్రమ కేసులు పెడుతున్నారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు స్కిల్ స్కామ్ లో అన్ని ఆధారాలతో అరెస్ట్ అయ్యాడు.. ప్రభుత్వ నిధులు దారిమళ్లించిన ఆధారాలు ఉన్నాయి.. కేంద్ర ఏజెన్సీ విచారణలో స్కిల్ స్కామ్ వెలికి తీసింది.. ఇక్కడ లిక్కర్ కేసులో ఒక్క ఆధారం లేదు.. అన్యాయంగా అందరిని అరెస్ట్ చేస్తున్నారు.. అక్రమంగా అరెస్ట్ చేసిన అందరి ఉసురు చంద్రబాబు కుటుంబానికి తగులుతుంది.. ఎన్ని కేసులు పెట్టిన ఎదుర్కొంటాం.. కేసుల్లో ఏమి లేదని ఈరోజు తేలిపోయింది.. దీన్ని మళ్ళీ మా అధ్యక్షుడుకి అంతగట్టడానికి ప్లాన్ చేస్తున్నారని సజ్జల ఆరోపించారు.

Exit mobile version