NTV Telugu Site icon

Life Threatening: ఆ ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని.. వైసీపీ నేత ఆరోపణలు..!

Namburi Shankar Rao

Namburi Shankar Rao

Life Threatening: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నేత.. తమ సొంత పార్టీ ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.. గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం వైసీపీ నాయకుడు దండా నాగేంద్ర కుమార్.. అదే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే నంబూరి శంకర్రావుపై సంచనల ఆరోపణలు చేశారు.. ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు కుటుంబంతో నాకు ప్రాణ హాని ఉందని ఆరోపించారు.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే శంకర్రావు ,అతని కుటుంబ సభ్యులు నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారన్న ఆయన.. గతం లో పెదకూరపాడు నియోజకవర్గంలో ఇసుక వ్యవహారంలో నాతో ఎమ్మెల్యే శంకర్రావు గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేయించారు.. జేపీ సంస్థ ఇసుక అమ్ముతుందన్న అక్కసుతో నన్ను బెదిరించి, ప్రలోభ పెట్టి గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేయించారని తెలిపారు..

Read Also: Rahul Gandhi Disqualification: రాహుల్‌ గాంధీ పదేళ్ల క్రితం ఆ ఆర్డినెన్స్‌ను చించకుండా ఉండుంటే..

ఇక, ఇప్పుడు ఇసుక కాంట్రాక్ట్ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావుకు రావడం తో NGTలో కేసు వాపసు తీసుకోవాలని బెదిరిస్తున్నారు.. నాపై అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు భేఖాతరు చేసి పెదకూరపాడు నియోజకవర్గంలో పెద్ద పెద్ద మిషనరీలతో ఇసుక తవ్వెస్తున్నారని ఆరోపించారు దండా నాగేంద్ర కుమార్. కాగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇలా బహిరంగంగా ఆరోపణలు చేయడం గుంటూరు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.