NTV Telugu Site icon

Diamonds: కూలీలకు దగా… వ్యాపారులకు పండగ

Diamons

Diamons

కర్నూలు జిల్లా, తుగ్గలి (మం) జొన్నగిరిలో వర్షాకాలం వచ్చిందంటే చాలు అక్కడ కూలీలు, సామాన్య జనాలు ఒకటే హడావిడి. వజ్రాల వేటకు బయలుదేరతారు. తాజాగా కూలీలకు రెండు వజ్రాలు దొరికాయి. పొలం పనులు చేస్తున్న ఇద్దరు కూలీలకు దొరికిన రెండు వజ్రాలను వ్యాపారులు కొనేశారు. అది కూడా తక్కువ ధరకే అని తెలుస్తోంది. ఓ వజ్రాన్ని రూ.45 వేలకు, జత కమ్మలు ఇచ్చి కొన్నట్లు సమాచారం. మరొక వజ్రాన్ని రూ.35 వేలు ఇచ్చి కొనుగోలు చేశారు వ్యాపారులు.

జొన్నగిరి మదనంతపురం తుగ్గలి చుట్టుపక్కల ప్రాంతాలలో అత్యంత విలువైన వజ్రాలు దొరుకుతుంటాయి. నిన్న కురిసిన తేలికపాటి వర్షానికి కూలీ పనులు చేస్తుండగా ఓ మహిళకు వజ్రం లభ్యమైంది. మరొక వజ్రం వెతకటానికి వచ్చిన మహిళకు దొరికింది. జొన్నగిరికి చెందిన ఓ వ్యాపారి ఈ రెండూ వజ్రాలను కొన్నట్లు తెలుస్తోంది. అందులో ఒక వజ్రం విలువ బహిరంగ మార్కెట్లో 4 లక్షల 50 వేలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఈ వజ్రాన్ని స్థానిక వజ్రాల వ్యాపారి కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. వజ్రాల విలువ తెలియని అమాయకుల నుండి జొన్నగిరికి చెందిన ఒక వ్యాపారి తక్కువ రేటుకు కొంటున్నట్లు సమాచారం. దీని విలువ బహిరంగ మార్కెట్లో 5లక్షలు విలువ చేస్తుందని అంచనా వేస్తున్నారు వ్యాపారులు. గుట్టుచప్పుడు కాకుండా అనేక వజ్రాలు కొనుగోలు చేసి వ్యాపారులు కోట్లు గడిస్తున్నారు. అమాయకులైన రైతులు, కూలీలకు విలువైన వజ్రాలు లభ్యం అవుతున్నప్పటికీ వాటి విలువ తెలియక పోవడంతో వజ్రాల వ్యాపారులు అమాయకులైన కూలీల దగ్గరనుండి అతి తక్కువ రేటు కొనుగోలు చేసి కోట్లు గడిస్తున్నారు. వజ్రాల గురించి తెలిస్తే మరింత విలువ వారికి లభించి వుండేదంటున్నారు.

World Meditation Day : హైటెక్స్‌లో ప్రపంచ ధ్యాన దినోత్సవ వేడుకలు..