ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీలో చిరుత సంచారం కలకలం రేగింది. వర్శిటీ పరిపాలనా భవనం వద్ద కుక్కలపై చిరుత దాడికి యత్నించింది. ఈ దృశ్యాలు వర్శిటీ సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డు అయ్యాయి. దీంతో యూనివర్సిటీ విద్యార్థులు, భద్రతా సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వర్సిటీకి చేరుకున్న అటవీ సిబ్బంది చిరుత సంచరించిన పరిసరాలను పరిశీలిస్తున్నారు. ఐతే ఆరు నెలలుగా ఎస్వీ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ, వేదిక్ యూనివర్సిటీ పరిసరాల్లో చిరుతలు తిరుగుతున్నాయని, రెండుసార్లు కుక్కలపై కూడా దాడి చేశాయని విద్యార్థులు అంటున్నారు.
Read Also: Onion Prices Fall: ఉల్లి ధర పతనం.. అన్నదాతల కన్నీరు..
అయితే, తిరుపతి సమీప ప్రాంతాలల చిరుత పులుల సందడి పెరుగుతుంది.. రోజూ ఎదో ఒకచోట చిరుతు పులుల అలజడులు సర్వసాధారణంగా మారింది .. దానికి ఇటీవల కాలంలో వరుసగా జరుగుతూ దాడులు ఉదాహరణగా చేబుతున్నారు అటవీశాఖ అధికారులు .. శేషచలం కొండల కేంద్రం తిరుమలలో వరుసగా చిరుతలు హల్ చల్ చేస్తుంటే… కొండ కింద తిరుపతిలో అదే పరిస్థితులు నెలకొన్నాయి.. తాజాగా ఎస్వీ వెటర్నరీ యూనివర్శిటీలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. యూనివర్సిటీ పరిపాలన భవనం ఆవరణలో నిన్న అర్ధరాత్రి చిరుత సంచరించింది. అక్కడ నిద్రిస్తున్న ఓ శునకాన్ని పట్టుకునే ప్రయత్నం కూడా చేసింది. అయితే ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. నిన్న అర్ధరాత్రి సంచరించిన చిరుత జాడను ఇవాళ యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన సిబ్బంది… యూనివర్సిటీ వద్దకు చేరుకొని చిరుత జాడలను గుర్తించారు. మరోసారి చిరుత యూనివర్సిటీ ఆవరణంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక గ్రామాల ప్రజలు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు పులిని వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కొన్ని నెలల కిందట యూనివర్సిటీలోని ఆవరణలో, సమీపంలోని పంట పొలాల్లో చిరుత సంచరించడం స్ధానికులు గమనించారు. అప్పుడు కూడా అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే అదే రోజు యూనివర్సిటీలోని ఓ శునకంపై దాడి చేసి గాయ పరచడంతో విద్యార్థులు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురి అయ్యారు.