NTV Telugu Site icon

Tirumala: తిరుమలలో మరోసారి చిరుత కలకలం..

Leopart

Leopart

Tirumala: తిరుమలలో మరోసారి చిరుత సంచారం తీవ్ర కలకలం రేపింది. ఈ క్రమంలో పులి సంచారంతో శ్రీవారి భక్తుల్లో ఆందోళన మొదలైంది. కాగా, తిరుమల శ్రీవారి మెట్టు దగ్గర ఉన్న కంట్రోల్ రూమ్ వద్దకు రాత్రివేళ చిరుత రావడంతో కుక్కలు దాని వెంట పడ్డాయి. అయితే, చిరుత సంచారంపై భక్తులు చెప్పగానే సెక్యూరిటీ గార్డు భయంతో కంట్రోల్ రూమ్ లోకి వెళ్లి తాళాలు వేసుకున్నారని పేర్కొన్నారు. సెక్యూరిటీ గార్డు సైతం ఉదయం టీటీడీ అధికారులకు, అటవీ అధికారులకు చిరుత సమచారంపై అందించారు. వన్య మృగాల‌ కదలికలు గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయడానికి అధికారులు చర్యలు చేపట్టింది.

Read Also: Tirupati Laddu Controversy: తిరుమల లడ్డూ వ్యవహారంపై సిట్ దర్యాప్తు వేగవంతం..

ఇక, శ్రీవారి మెట్టు మార్గం, అలిపిరి నడక మార్గం, ఘాట్ రోడ్డుల్లో చిరుత పులి సంచారంతో భక్తులు, టీటీడీని కలవర పెడుతోంది. ముఖ్యంగా నడక మార్గంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చుట్ట పక్కల చిరుతల సంచారం ఎక్కువగా ఉన్నట్లు టీటీడీ, అటవీ శాఖ అధికారులు గుర్తించారు. నడక మార్గంలో తిరుమలకు వెళ్లాలంటేనే భక్తులు భయపడుతున్నారు. గతంలో చిరుతల సంచారంతో టీటీడీ అధికారులు మధ్యాహ్నం 2 గంటల వరకే చిన్న పిల్లలను నడక మార్గంలో అనుమతించేలా తగిన చర్యలు చేపట్టారు. ఏడో మైలురాయి నుంచి గాలిగోపురం వరకూ హై అలెర్ట్ జోన్‌గా ప్రకటించిన తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు పలు జాగ్రత్తలు చెప్పుకొచ్చింది.