Site icon NTV Telugu

Lemon Price Hike : నిమ్మ రైతుల పంట పండింది.. కిలో రూ.200

Lemon

Lemon

నిన్న మొన్నటి వరకు రైతులకు నష్టాలను మిగిల్చిన నిమ్మ.. ఇప్పుడు లాభాలను తెచ్చిపెడుతోంది. సమ్మర్ లో నిమ్మకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో.. మార్కెట్లో కిలో నిమ్మ ధర సుమారు 200 రూపాయలు పలుకుతోంది.. నెల్లూరు జిల్లాలోని పొదలకూరు గూడూరు నిమ్మ మార్కెట్లో రికార్డు స్థాయిలో ధర పలుకుతూ ఉండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నిమ్మ రాలిపోయిందని.. లేకపోతే దిగుబడి కూడా బాగుండేదని రైతులు అంటున్నారు. ఇంతకీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నిమ్మ ఎంత మేర సాగు చేస్తారు..? పెరిగిన ధరలపై రైతులు ఏమంటున్నారో చూద్దాం.

Praful Hinge: వైభవ్ సూర్యవంశీ బలహీనతను ఎక్స్‌పోజ్ చేసిన ప్రఫుల్ హింజ్..

నిమ్మ రైతుల పంట పండింది.. వేసవికాలంతోపాటు ఉత్తరాది రాష్ట్రాలలో నిమ్మకాయలకు భారీగా డిమాండ్ పెరిగింది. ఇది నిమ్మ రైతులకు కలిసి వచ్చింది. బహిరంగ మార్కెట్లో నిమ్మకాయలకు భారీగా ధర పలుకుతుంది. ధరల్లో ఆపిల్ తో పోటీ పడుతుంది.. నెల్లూరు జిల్లాలో నిమ్మ సాగు చాలా ప్రధానమైనది. ప్రస్తుతం చాలామంది రైతులు నిమ్మను సాగు చేస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మర్రిపాడు, ఉదయగిరి, వింజమూరు, పొదలకూరు, గూడూరు, వెంకటగిరి, రాపూర్, సైదాపురం వంటి ప్రాంతాలలో నిమ్మ ప్రధాన సాగుగా ఉంది. జిల్లాలో ఎక్కువ సాగు ఉండడంతో పొదలకూరు గూడూరులో నిమ్మ మార్కెట్ ఏర్పాటయింది. ఈ క్రమంలో సమీప ప్రాంతంలోని రైతులందరూ ఆ రెండు మార్కెట్లలో నిమ్మకాయలను అమ్ముతుంటారు. అక్కడి నుంచి వ్యాపారులు ఇతర రాష్ట్రాలకు తరలిస్తుంటారు. నిమ్మ సాగు పైనే ఆధారపడి జీవించే వారి సంఖ్య ఇటీవల ఎక్కువైంది. తక్కువ నీటితో సంవత్సరం అంతా ఆదాయం వచ్చే పంట కావడంతో అందరూ దీని వైపే మొగ్గు చూపుతున్నారు. కష్టం, నష్టాన్ని ఓర్చుకుని రైతులు సాగు చేస్తున్నారు..

US Sailor Attacked by Monkey: హార్మూజ్ మిషన్‌కు బయలుదేరిన అమెరికా సైనికుడిపై కోతి దాడి.. మందుపాతరల తొలగింపులో వింత ఘటన

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో లక్షల ఎకరాలలో నిమ్మను సాగు చేస్తూ ఉండగా.. పొదలకూరు, గూడూరు సమీప ప్రాంతాలలో ఎక్కువ సాగు చేస్తున్నారు. ఇటీవల కాలంలో నిమ్మ ధరలు భారీగా పతనమయ్యాయి.. అయితే గత నెల రోజుల నుంచి నిమ్మ ధరలకు రెక్కలు వచ్చాయి.. కిలో 120 నుంచి 130 వరకు నిన్న మొన్నటి వరకు ధర పలకగా.. ఇప్పుడు ఏకంగా కిలో 200 రూపాయల వరకు చేరింది. అంటే 50 కేజీల బస్తా పదివేల నుంచి 12 వేల వరకు ధర పలుకుతుంది. మార్కెట్లో ధరలు భారీగా ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిగుబడి ఎక్కువగా ఉన్న సమయంలో కేజీ 30 నుంచి 40 రూపాయలకే పడిపోయిందని.. ఇప్పుడు దిగుబడి తగ్గడంతో.. డిమాండ్ పెరిగి రికార్డు స్థాయిలో ధర పలుకుతోందని నిమ్మ రైతులు చెబుతున్నారు..

ఇటీవల కాలంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అకాల వర్షం కురిసి.. సైదాపురం రాపూరు పొదలకూరు వంటి ప్రాంతాలలో నిమ్మ రైతులకు విషాదాన్ని నింపింది. చెట్టు మీద ఉన్న పూత పిందే నేల రాలిపోయింది. దీంతో చాలావరకు దిగుబడి తగ్గింది. ఈ క్రమంలో ఏపీ తోపాటు ఇతర రాష్ట్రాలలో నిమ్మకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఇక్కడి నిమ్మకాయలకు ఉత్తరాది రాష్ట్రాలలో విపరీతమైన డిమాండ్ ఉంది. ఢిల్లీ మార్కెట్లో పొదలకూరు నెమ్మకు మంచి డిమాండ్ ఉండడంతో ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు రోజుకు 15 నుంచి 20 లారీలు దాకా తరలి వెళ్తుంటాయి. నెల్లూరు జిల్లాలోని మెట్ట ప్రాంతాలలో ఈ సాగు ఎక్కువగా ఉంటుంది. వాస్తవానికి ఎండాకాలంలో నిమ్మకాయలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు జనాలు నిమ్మరసంతో తయారుచేసిన పానీయాల వైపు ఆ ముగ్గు చూపుతుంటారు. అదే సమయంలో ఎండాకాలంలో నిమ్మ సాగు కూడా ఆశించిన స్థాయిలో దిగుబడి రాదు. దీంతో ఉత్పత్తి తగ్గడంతో డిమాండు పెరుగుతూ ఉంటుంది. గత కొన్నేలులుగా ఎన్నడూ లేని విధంగా 50 కిలోల బస్తా పదివేల నుంచి 12000 ధర పలుకుతోందని రైతులు వ్యాపారులు వర్షం వ్యక్తం చేస్తున్నారు..

జనవరిలో కనీస ధర కూడా లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కిలో 8 రూపాయల మేర అమ్ముకొని నష్టాలను చవిచూశారు. పెట్టిన పెట్టుబడి కూడా రాలేదని తీవ్ర ఆవేదనకు గురయ్యారు. రైతులు నష్టపోకూడదని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మార్కెటింగ్ శాఖ ద్వారా కిలో ఎనిమిది రూపాయలకు కొనుగోలు చేసి వివిధ ప్రాంతాలకు తరలించారు. ఆశగా కిలో రెండు వందల వరకు రైతులు విక్రయిస్తూ ఉండడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. పొదలకూరు గూడూరు నుంచి ఢిల్లీ మార్కెట్కు ఎగుమతులు బాగా పెరుగుతున్నాయని.. మరో 20 రోజుల వరకు ధరలు తగ్గే అవకాశం లేదని వ్యాపారులు రైతులు చెబుతున్నారు. ఈ లోపు కాయలు కోతకొస్తే ధర తగ్గిపోతుందని వివరిస్తున్నారు..

 

Exit mobile version