Praful Hinge: వైభవ్ సూర్యవంశీ బలహీనతను ఎక్స్‌పోజ్ చేసిన ప్రఫుల్ హింజ్..
- ప్రఫుల్ హింజ్ తన ఐపీఎల్ అరంగేట్రంలోనే సంచలనం
- మొదటి ఓవర్‌లోనే మూడు వికెట్లు తీసి చరిత్ర
- వైభవ్ సూర్యవంశీ బలహీనతను ఎక్స్‌పోజ్ చేసిన ప్రఫుల్ హింజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ ప్రఫుల్ హింజ్ తన ఐపీఎల్ అరంగేట్రంలోనే సంచలనం సృష్టించాడు. తన మొదటి ఓవర్‌లోనే మూడు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. ఫామ్‌లో ఉన్న వైభవ్ సూర్యవంశీని ప్రఫుల్ సున్నా పరుగులకే (గోల్డెన్ డక్) ఔట్ చేశాడు. సూర్యవంశీని ఎలా ఔట్ చేశాడో, తన వ్యూహాన్ని హింజ్ వెల్లడించాడు. ఏప్రిల్ 13న హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో, రాజస్థాన్ రాయల్స్ 217 పరుగుల ఛేజింగ్‌లో ఒక దశలో 5 వికెట్లకు 9 పరుగుల దూరంలో నిలిచింది. ఆర్ఆర్ అంతకు ముందు ఏ మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. అరంగేట్రం చేసిన హింజ్ తన మొదటి ఓవర్‌లోనే మూడు వికెట్లు తీయడంతో రాజస్థాన్ ఈ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంది.
ఇప్పుడు, సూర్యవంశీపై తన వ్యూహాన్ని ప్రఫుల్ వెల్లడించాడు. వైభవ్ సూర్యవంశీ వికెట్ కోసం ప్రఫుల్ హింజ్ తన వ్యూహాన్ని వెల్లడించాడు. జియోస్టార్/పోస్ట్-మ్యాచ్ ఇంటర్వ్యూలో హింజ్ ఇలా అన్నాడు.. “వైభవ్ సూర్యవంశీ వికెట్ నాకు చాలా ఆనందం ఇచ్చింది ఎందుకంటే అతను ఫామ్‌లో ఉన్నాడు. నేను 2-3 మందికి ముందే చెప్పాను.. ‘మెయిన్ ఇస్కో పెహ్లీ బాల్ పే బౌన్సర్ డాల్ కే అవుట్ కరుంగా’. నాకు కేవలం మొదటి బంతికే అతన్ని ఔట్ చేయాలని ఉంది. బౌలింగ్ కోచ్ వరుణ్ భాయ్ (వరుణ్ ఆరోన్) సహాయంతో ఈ ప్లాన్ చేశాం.”అండర్-13 లేదా యూత్ లెవల్‌లో సూర్యవంశీతో ఆడిన అనుభవం కూడా హింజ్‌కు సహాయపడింది.
Also Read
- Gautam Gambhir: "ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?".. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
- Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- IND vs SL Semi-Final: భారత్ vs శ్రీలంక సెమీఫైనల్.. బుడ్డోడికి షాక్.. ప్లేయింగ్ 11, పిచ్, వెదర్, లైవ్ డీటెయిల్స్ ఇవే!
- Shubman Gill: 405 స్కోర్ చూసి కంగారుపడిపోయా.. ఓటమి తప్పదనుకున్నా.. కానీ.: గిల్
బౌన్సర్‌తో అతన్ని ఔట్ చేసిన గతం ఉండటంతో, ఈ మ్యాచ్‌లో కూడా అదే వ్యూహం అమలు చేశాడు. సూర్యవంశీ బంతిని పుల్ చేయడానికి ప్రయత్నించాడు కానీ హార్డ్ లెంగ్త్ బంతి (బ్యాక్ ఆఫ్ లెంగ్త్) వేగంగా రావడంతో టైమింగ్ కుదరక, టాప్ ఎడ్జ్ తీసి వికెట్ కీపర్ సలీల్ అరోరా చేతికి చిక్కాడు. హింజ్ మాట్లాడుతూ.. “నేను అతనికి రౌండ్ ది వికెట్ బౌలింగ్ చేయాలనుకున్నాను కానీ కోచ్ ఓవర్ ది వికెట్ సలహా ఇచ్చారు. అలాగే చేసి, అదే బంతితో వైభవ్‌ను ఔట్ చేశాను. దీనివల్ల మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నామన్నాడు.
ప్రఫుల్ హింజ్ చారిత్రాత్మక అరంగేట్రం
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన 24 ఏళ్ల హింజ్, తన మొదటి ఓవర్‌లోనే మూడు వికెట్లు (వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్, లూహాన్‌డ్రే ప్రీటోరియస్ – ముగ్గురూ డక్‌లు) పడగొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో అరంగేట్రం మ్యాచ్‌లోనే మొదటి ఓవర్‌లో మూడు వికెట్లు తీసిన తొలి బౌలర్ గా ప్రఫుల్ హింజ్ నిలిచాడు. తన నాలుగు ఓవర్ల స్పెల్‌లో 4 వికెట్లు (34 పరుగులు ఇచ్చి) పడగొట్టాడు. రెండో ఓవర్‌లో రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ వికెట్ కూడా తీసి సంచలనం కొనసాగించాడు. ఈ అద్భుత ప్రదర్శనకు గాను అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్‌ను 57 పరుగుల తేడాతో గెలుచుకుంది.
తాజావార్తలు
-
Chandu Mondeti : టాలీవుడ్, బాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ లాక్..?
-
UPSC Centenary 2026: UPSC శతాబ్ది వేడుకలు.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వందేళ్ల చరిత్ర ఇదే
-
Rain Alert: ఉరుములు, మెరుపులతో మూడు రోజులు వర్షాలు!
-
IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
-
Nethanna Bharosa: చేనేతలకు సర్కార్ మరో గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!