NTV Telugu Site icon

Leela Pavithra: నేడు లీలా పవిత్ర అంత్యక్రియలు.. వెలుగులోకి షాకింగ్‌ విషయాలు..

Leela Pavithra

Leela Pavithra

Leela Pavithra murder case: మంగళవారం బెంగళూరులో లీలా పవిత్రను కిరాతకంగా కత్తితో పొడిచి ఉన్మాది దినకర్ హత్య చేయడం కలకలం రేపింది.. అయితే.. ఇవాళ బెంగళూరులోనే లీలా పవిత్ర మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు కుటుంబ సభ్యులు.. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జగన్నాథపురంలో నివాసం ఉంటున్నారు లీలా పవిత్ర తల్లిదండ్రులు.. ఇప్పటికే కుమార్తె మృతదేహాన్ని తల్లిదండ్రులుగా అప్పగించారు బెంగళూరు పోలీసులు.. తల్లిదండ్రులకు లీలా పవిత్ర (28) ఏకైక కుమార్తె కావడంతో.. వారిని అదుపుచేయడం ఎవరి తరం కావడంలేదు.. కాగా, పెళ్లికి అంగీకరించడం లేదని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రియుడు దినకర్ (29) అత్యంత దారుణంగా లీలా పవిత్రను హత్య చేసిన విషయం విదితమే..

లీలా పవిత్ర అలియాస్ లీలా ఎమ్మెస్సీ పూర్తి చేసింది. బెంగళూరు మురగేశ్ పాళ్యలోని ఓమెగా మెడిసిన్ కంపెనీలో ల్యాబ్ లో ఉద్యోగం చేస్తున్నది. మంచి ఉద్యోగం చేస్తున్న లీలా పవిత్రా నిత్యం ఆమె కుటుంబ సభ్యులతో టచ్ లో ఉండేది. ఇక, శ్రీకాకుళానికి దినకర్ కూడా బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు.. ఐదు సంవత్సరాల నుంచి లీలా పవిత్రా, దినకర్ ప్రేమించుకుంటున్నారు. కొన్ని నెలల క్రితం దినకర్, లీలా పవిత్రా వారి ప్రేమ విషయం వాళ్లవాళ్ల కుటుంబ సభ్యులకు చెప్పారు.వారి కులాలు వేరు కావడంతో వారు పెళ్లి చేసుకోవడానికి వీలులేదని లీలా పవిత్రా కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. అయితే పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ప్రేమికులు దినకర్, లీలా పవిత్రా అనేక ప్రయత్నాలు చేశారని తెలిసింది. దినకర్ తో పెళ్లికి తాము అంగీకరించమని లీలా పవిత్రా కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారని తెలిసింది. దినకర్ తో ఇక ముందు నువ్వు మాట్లాడకూడదని లీలా పవిత్రాకు ఆమె కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. కుటుంబ సభ్యుల ఒత్తిడితో కొంతకాలం నుంచి లీలా పవిత్రా ఆమె ప్రియుడు దినకర్ ను దూరం పెట్టి అతన్ని కలవడం మానేసింది. ప్రియురాలికి దగ్గర కావాలని దినకర్ చాలా ప్రయత్నాలు చేసాడు కానీ, లీలా పవిత్ర మాత్రం మాజీ ప్రియుడు దినకర్ ను కలవకూడదని డిసైడ్ అయ్యింది. ఇక మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో దినకర్ అతని ప్రియురాలు లీలా పవిత్రా ఉద్యోగం చేస్తున్న మురగేశ్ పాళ్యలోని కంపెనీ దగ్గరకు వెళ్లాడు. రాత్రి పని ముగించుకుని లీలా పవిత్రా కంపెనీలో నుంచి బయటకు వచ్చింది. నీతో మాట్లాడాలని దినకర్ చెప్పడంతో లీలా పవిత్రా కొంచెం పక్కకు వచ్చింది. తనను ఎందుకు దూరం పెడుతున్నావని అడుగుతూ దినకర్ తన జేబులో ఉన్న కత్తి తీసుకొని మొదట లీలా పవిత్రా కడుపులో పదేపదే పొడిచాడు. లీలా పవిత్రా కేకలు వెయ్యడంతో ఇంకా రగిలిపోయిన దినకర్ ఆమె ఛాతీ ముఖం, గొంతు తదితర చోట్ల ఇష్టం వచ్చిన 16 సార్లు పొడిచేశాడు. తీవ్రగాయాలైన లీలా పవిత్రా అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటన కలకలం సృష్టించింది.

ఇక, ఈ కేసులో పోలీసు విచారణలో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి.. లీలా పవిత్రను కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. ఇదిలా ఉండగా, తాజాగా సీసీటీవీ ఫుటేజీలో నిందితులు నేరం జరిగిన ప్రదేశంలో కనిపించారు. ఫుటేజీలో నిందితుడు గేటు దగ్గర లీలా విగతజీవి పక్కన కూర్చున్నట్లు కూడా చూపించారు. లీలాపై దినకర్ 16 సార్లు కత్తితో పొడిచాడు. తమ సంబంధానికి లీలా కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో నిందితులు బాలికను హత్య చేశారు.
ప్రారంభంలో, నిందితుడు సెక్యూరిటీ గార్డుల నుంచి ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఒమేగా హెల్త్‌కేర్ భవనంలోకి ప్రవేశించాడు. రెండు కత్తులతో ఆయుధాలతో ఉన్న దినకర్.. లీలాను ఆమె ఆఫీసు నుంచి బయటకు తీసుకురాగలిగాడు. ఆమె బయటకు రాగానే నిందితుడు ఆమెపైకి దూసుకెళ్లి కత్తితో పొడిచాడు. కులాంతర వివాహాన్ని కుటుంబసభ్యులు వ్యతిరేకించడంతో బెంగుళూరులో జిల్లేడు ప్రేమికుడు కత్తితో హత్య చేశాడు. అయితే, ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యంగా స్పష్టంగా కనిపిస్తుందనే విమర్శలు ఉన్నాయి. బాధితురాలు ఆంధ్రప్రదేశ్‌లో దినకర్‌పై దిశ (ఆపదలో ఉన్న మహిళలకు సహాయం చేసే యంత్రాంగం)కి ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. బదులుగా, దిశ అధికారులు బాధితురాలు మరియు నిందితుల మధ్య రాజీ కుదిర్చారని తెలుస్తోంది.