Land Scams Increased In Andhra Pradesh Says Byreddy Rajasekhar Reddy: జగన్ ప్రభుత్వం, వైసీపీ నేతలు భూములపైనే ఎక్కువ దృష్టి పెట్టారని.. ఏపీలో భూ కుంభకోణాలు అధికమయ్యాయని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ భూకుంభకోణాల గురించి జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయన్నారు. ఆన్‌లైన్‌లో స్థలాల పేర్లు మార్చేస్తున్నారని.. ఆన్‌లైన్ వ్యవస్థ ఫ్రాడ్‌గా తయారైందని మండిపడ్డారు. భూకుంభకోణాల్లో ఇరుక్కునేది అధికారులేనన్నారు. భూకుంభకోణాలు ప్రధాన ఆదయవనరుగా మార్చుకుంటున్నారని.. అందరూ కూడబలుక్కొని భూములు దోచేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నపుడు ఓర్వకల్‌లో జూనియర్ కాలేజీ కోసం ఐదు ఎకరాల భూమిని కేటాయించానని, ఇప్పుడు కాలేజీ భూబకాసురులు దాన్ని ఆక్రమించుకొని కేవలం రెండు ఎకరాలు మాత్రమే మిగిల్చారని పేర్కొన్నారు. ఐదు ఎకరాలకు ప్రహరిగొడ నిర్మించి భూమిని కాపాడకుంటే.. తాను కోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు.
అంతకుముందు ఏపీ ప్రభుత్వం సరఫరా చేస్తోన్న మద్యంపై కూడా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఏపీలో పది మద్యం బాటిళ్లు తాగినా మత్తు ఎక్కడం లేదని, కలర్ నీళ్లు కలిపి బారు షాపుల్లో అమ్ముతూ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని ఆరోపించారు. ఎవరైనా మద్యం తాగి ఊగితే, అది ఇతర రాష్ట్రాల మందు అయ్యుంటుందే తప్ప ఏపీది కాదని ఎద్దేవా చేశారు. తండ్రి వైఎస్సార్ మంచి పేరు సంపాదిస్తే, కొడుకు జగన్ మాత్రం ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తున్నారని మండిపడ్డారు. చివరికి రేషన్ దుకాణాల్లో పంపిణీ చేస్తున్న బియ్యం కూడా నాసిరకంగా ఉన్నాయని, వాటిలో పురుగులు పడుతున్నాయని విమర్శించారు.