AP ZPTC Elections: ఎమ్మిగనూరులో కలకలం.. చెత్తకుప్పలో బ్యాలెట్ పేపర్లు.. రీకౌంటింగ్‌కు డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP ZPTC Elections: ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో ఇప్పుడు ఓ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్ల కట్ట చెత్తకుప్పలో బయటపడటం రాజకీయంగా కలకలం రేపుతోంది. స్థానిక జూనియర్ కాలేజీ ఆవరణలోని చెత్తకుప్పలో సుమారు 50 బ్యాలెట్ పేపర్లు ఉన్న కట్టను గుర్తించారు. కౌంటింగ్ కేంద్రానికి సమీపంలోనే ఈ బ్యాలెట్ పేపర్లు లభించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయాన్ని తెలుసుకున్న వైసీపీ ఇన్చార్జ్ రాజీవ్ రెడ్డి అక్కడికి చేరుకుని బ్యాలెట్ పేపర్ల కట్టను తెరిచి మీడియాకు చూపించారు. వాటిలో ఒక బ్యాలెట్ పేపర్‌ను పరిశీలించగా, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసినట్లు కనిపించిందని తెలిపారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఈ బ్యాలెట్ పత్రాలను లెక్కించారా? లేక లెక్కించకుండా పక్కన పడేశారా? అనే అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు. అసలు బ్యాలెట్ పేపర్లు చెత్తకుప్పలోకి ఎలా చేరాయో అధికారులు సమాధానం చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు..
ఈ నెల 3వ తేదీన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగింది. ప్రస్తుతం బయటపడిన బ్యాలెట్ పేపర్ల కట్ట గోనెగండ్ల జడ్పీటీసీ నియోజకవర్గానికి సంబంధించినదిగా గుర్తించినట్లు సమాచారం. గోనెగండ్ల మండలంలోని 14/59, 14/50 పోలింగ్ కేంద్రాలకు చెందిన బ్యాలెట్ పత్రాలుగా తెలుస్తోంది. ఇవి చిన్నమరివీడు గ్రామానికి చెందిన బ్యాలెట్ పేపర్లు అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. గోనెగండ్ల జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి 700కు పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో బ్యాలెట్ పేపర్ల కట్ట బయటపడటంతో వైసీపీ ఇన్చార్జ్ రాజీవ్ రెడ్డి మరోసారి రీకౌంటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై బాధ్యులైన అధికారులపై ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.. మరోవైపు, ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించామని ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి గతంలో పేర్కొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇప్పుడు బయటపడిన బ్యాలెట్ పేపర్లపై ఆయన సమాధానం చెప్పాలని రాజీవ్ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే, ఈ బ్యాలెట్ పత్రాలు కౌంటింగ్‌లో లెక్కించారా లేదా, అవి చెత్తకుప్పలోకి ఎలా చేరాయన్న విషయాలపై అధికారుల వివరణ రావాల్సి ఉంది.
Also Read
- Devaragattu Bunny Utsavam 2026: దేవరగట్టు బన్నీ ఉత్సవాలకు అంతా రెడీ.. భారీ భద్రత ఏర్పాటు.. ఉత్సవం వెనుక అసలు కథ ఏంటి?
- Sangameswara Temple: ఆరు నెలల ముందే బయటపడ్డ సంగమేశ్వరుడు.. కృష్ణా తీరంలో ముందస్తుగా కరవు ఛాయలు.!
- MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
తాజావార్తలు
-
Road Accident: జబర్దస్త్ నటులకు రోడ్డు ప్రమాదం.. దొరబాబు, రైజింగ్ రాజులకు గాయాలు..!
-
BM Sandeep Kumar: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఇన్ఛార్జీ బీఎం సందీప్ కుమార్ కీలక పిలుపు..
-
AP ZPTC Elections: ఎమ్మిగనూరులో కలకలం.. చెత్తకుప్పలో బ్యాలెట్ పేపర్లు.. రీకౌంటింగ్‌కు డిమాండ్
-
Nitish Setu Controversy: ‘నితీశ్ సేతు’పై రాజకీయ రగడ.. ప్రధాని మోడీ వెళ్లగానే ఆర్జేడీ కార్యకర్తల హంగామా
-
Vrushakarma: ‘వృషకర్మ’ రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ.. ట్రైలర్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
-
Nikhil Chaudhary: భారత్‌లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!
-
IND vs NZ: ముగిసిన నాలుగో రోజు ఆట.. డ్రా దిశగా కివీస్ పోరాటం.. భారత్ విజయానికి మరో 8 వికెట్ల దూరంలో..!
-
Jacob Duffy: బ్యాట్‌తో కాదు.. బంతితో డబుల్ సెంచరీ.. 22 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు..!