NTV Telugu Site icon

Posani Krishna Murali: పోసాని బెయిల్‌ పిటిషన్‌పై నేడు విచారణ..

Posani

Posani

Posani Krishna Murali: సినీనటుడు పోసాని కృష్ణ మురళి బెయిల్‌ పిటిషన్‌పై నేడు కర్నూలు కోర్టులో విచారణ జరగనుంది.. పోసాని బెయిల్ పిటిషన్ పై ఈ రోజు కర్నూలు జేఎఫ్‌సీఎం కోర్టు విచారణ చేపట్టనుంది.. మరోవైపు, పోసాని కస్టడీ పిటిషన్ పై ఇప్పటికే తీర్పు రిజర్వు చేసింది కోర్టు.. గత 5 రోజులుగా కర్నూలు జైలులో రిమాండ్‌లో ఉన్నారు పోసాని.. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌ను గతంలో దూషించారనే ఫిర్యాదు మేరకు ఆదోని ట్రీ టౌన్ లో కేసు నమోదు అయిన విషయ విదితమే కాగా.. పోసానిని అరెస్ట్‌ చేసి విచారించిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టి.. ఆ తర్వాత కర్నూలు జైలుకు తరలించారు..

Read Also: Argentina: భారీ వర్షాల దెబ్బకి 16 మంది మృతి.. అనేక మంది గల్లంతు

మరోవైపు, పోసాని కృష్ణ మురళికి కడప మొబైల్ కోర్ట్ బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే.. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్‌లో పోసానిపై నమోదైన కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు.. పోసానిపై ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్‌లో గత నెల 24వ తేదీన కేసు నమోదు కాగా.. ఈ కేసులో గత నెల 28వ తేదీన ఓబులవారిపల్లె పోలీసులు పోసాని కృష్ణ మురళిని అరెస్టు చేశారు. 29వ తేదీన రైల్వే కోడూరు కోర్టులో హాజరుపర్చగా.. పోసానికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.. అయితే, కడప మొబైల్ కోర్టు పోసానికి బెయిల్‌ మంజూరు చేసినా.. మిగతా కేసుల్లో బెయిల్‌ రాకపోవడంతో.. ఆయన జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది..