NTV Telugu Site icon

Raging: కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. మీసాలు, గడ్డాలు తీయాల్సిందే..!

Raging

Raging

Raging: కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. తరగతులు ప్రారంభమై వారం గడవక ముందే జూనియర్లకు ర్యాగింగ్ వేధింపులు మొదలయ్యాయి. మీసాలు, గడ్డాలు తీసేసుకోవాలని సీనియర్ల హుకుం చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళ్లజోడు కూడా తాము చెప్పిన వాటినే పెట్టుకోవాలని, ఆకడమిక్ ఆన్ లైన్ యాప్ లు తాము చెప్పినవి తీసుకోవాలని సమాచారం. తరగతులు అయిన వెంటనే గుంపులు గుంపులుగా వెళ్లి క్యాంపస్ లోనే జూనియర్లను ర్యాగింగ్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. మూడు రోజుల క్రితమే కాలేజీలో ర్యాగింగ్ పై ప్రిన్సిపాల్ యాంటీ ర్యాగింగ్ సమావేశం నిర్వహించగా ఎస్పీ కూడా హాజరయ్యారు. ర్యాగింగ్ నేరమని, ర్యాగింగ్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. ఈ నెల 14వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి.

Read Also: Naga Chaitanya : పెళ్లి తర్వాత ముంబైలో కాపురం పెట్టనున్న నాగచైతన్య, శోభిత ?

గత ఏడాది కూడా ర్యాగింగ్ తో విద్యార్థుల పేరెంట్స్ యూజీసీకి ఫిర్యాదు చేశారు. కమిటీ నియమించి విచారించినా ఎవరిపైనా ఎవరిపైనా చర్యలు తీసుకోని ఫలితంగా ఈ ఏడాది మళ్లీ విద్యార్థులకు ర్యాగింగ్ తప్పడం లేదు. గత ఏడాది మెడికల్ కాలేజీ మేన్స్ హాస్టల్ లో గంజాయి కూడా లభ్యమైంది. మెడికల్ కాలేజీ అధికారులపై తీవ్రస్థాయిలో విమర్శలున్నాయి. అయితే, ర్యాగింగ్ జరిగినట్లు ఫిర్యాదు రాలేదన్నారు ప్రిన్సిపాల్ చిట్టి నర్సమ్మ.. హాస్టల్ కి వెళ్లి కొత్త విద్యార్థులతో మాట్లాడానని, ర్యాగింగ్ జరిగినట్లు విద్యార్థులు చెప్పలేదనన్నారు ప్రిన్సిపాల్. చెప్పడానికి విద్యార్థులకు భయం ఉంటే తనకు వాట్సాప్ లో , ఫోన్ చేసి అయినా ఫిర్యాదు చేయవచ్చంటున్నారు ప్రిన్సిపాల్. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ర్యాగింగ్ చేసినట్లు ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకుంటామన్నారు ప్రిన్సిపాల్. ప్రస్తుతం వచ్చిన ర్యాగింగ్ ఆరోపణలపై కమిటీ నియమించి విచారణ జరిపిస్తామంటున్న మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ చిట్టినర్సమ్మ..