Ragging: రాయలసీమ యూనివర్సిటీలో ర్యాగింగ్ వ్యవహారం కలకలం సృష్టించింది.. యూనివర్సిటీలోని ఇంజినీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ చర్చగా మారింది.. ఇంజినీరింగ్ ఫస్టియర్ విద్యార్థి సునీల్ పై సీనియర్లు దాడి చేశారు. పరిచయ వేదిక పేరుతో హాస్టల్ లోకి ప్రవేశించిన సీనియర్లు.. సునీల్‌పై దాడి చేశారట.. అయితే, సీనియర్ల బారినుంచి తప్పించుకునే ప్రయత్నంలో హాస్ట్‌ల్ వదిలి.. కాలేజీలో గ్రౌండ్ లో పరుగులు పెట్టాడు సునీల్.. అయినా వదలని సీనిమర్లు.. వెంటపడి మరీ దాడి చేసేశారని జూనియర్లు వాపోతున్నారు.. గాయపడిన సునీల్ ను కర్నూలు జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఫస్టియర్ స్టూడెంట్ సునీల్ చికిత్స పొందుతున్నాడు.. కాగా, యూనివర్సిటీలు.. విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌ను రూపుమాపేందుకు ఆయా వర్సిటీలు.. విద్యాసంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి.. యాంటీ ర్యాగింగ్ కమిటీలను కూడా ఏర్పాటు చేస్తున్నా.. ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి.. విద్యార్థుల మధ్య స్నేహానికి ర్యాగింగ్ కూడా సహాయం చేస్తుందని.. ఏదో సినిమాలో ఓ పాట ఉంటుంది.. కానీ, ర్యాగింగ్ పేరుతో దాడులు చేయడం మాత్రం సరైంది కాదనే విషయాన్ని విద్యార్థులు గుర్తించుకుంటే మంచిది.
Read Also: KTR: కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం కేసు సోమవారానికి వాయిదా..