Site icon NTV Telugu

Kurnool: ప్రాణం తీసిన సంప్రదాయం..! గుర్రపు స్వారీ ప్రాక్టీస్ చేస్తూ వ్యక్తి మృతి

Horse Riding

Horse Riding

Kurnool: వారి సంప్రదాయం ప్రకారం.. గుర్రపుస్వారీ చేయాలి.. ముఖ్యంగా దసరా ఉత్సవాల రోజు గుర్రంపై ఊరేగడం వారి పూర్వికుల నుంచి సంప్రదాయంగా వస్తుంది.. అయితే, ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలన్న ఉద్దేశంతో.. ఓ యువకుడు గుర్రపుస్వారీ నేర్చుకోవడానికి పూనుకున్నాడు.. అదే అతడి ప్రాణాల మీదకు తెచ్చింది.. కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మద్దికేరలో గుర్రపు స్వారీ చేస్తూ కిందపడిన పృథ్వీరాజ్ రాయుడు అనే యువకుడికి తీవ్రగాయాలు అయ్యాయి.. ఆ వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరించారు స్థానికులు.. కానీ, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పృథ్వీరాజ్‌ రాముడు ప్రాణాలు విడిచాడు..

Read Also: Olympic Games Paris: పారిస్ ఒలింపిక్స్ లో గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌..రైమ్‌ల‌తో పి.వి.సింధు ఆత్మీయ క‌ల‌యిక‌

కాగా, పూర్వీకుల నుండి వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగించాలని ఉద్దేశంతో గుర్రపు స్వారీ నేర్చుకునేందుకు సిద్ధమయ్యాడు పృథ్వీరాజ్‌ రాముడు.. కొత్తవారు ఎవరైనా సరే.. గ్రురం పరుగులు పెడుతుంటే.. బ్యాలెన్స్‌ చేయడం కష్టం.. అదే పరిస్థితి రాముడుకు ఎదరైంది.. గుర్రం ఎక్కి ప్రాక్టీస్ చేస్తుండగా.. అది పరుగులు తీసింది.. కొద్దిసేపు ముందుకు సాగిన అతడు.. ఆ తర్వాత గుర్రంపై నిలవలేకపోయాడు.. బైక్‌పై గుర్రాన్ని వెంబడిస్తూ కొందరు యువకులు.. అదుపుచేసే ప్రయత్నం చేసినా గుర్రం పరుగులు ఆపలేదు.. దీంతో.. అదుపుతప్పి గుర్రంపై నుంచి రోడ్డుపై పడిపోయాడు.. తీవ్రగాయాలతో ప్రాణాపాయస్థితిలోకి వెళ్లిన పృథ్వీరాజు రాయుడును స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కానీ, అతడి ప్రాణాలు కాపాడలేకపోయారు.. చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే మృతి చెందాడు ఆ యువకుడు.. దీంతో.. ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.. అయితే, మద్దికెరలో దసరా ఉత్సవాలలో గుర్రంపై ఊరేగడం యాదవరాజు వంశీయుల సంప్రదాయం. యాదవరాజుల వంశానికి చెందిన పృథ్వీరాజ్‌ మృతి చెందడంతో.. ఈ ఏడాది దసరా ఉత్సవాలలో గుర్రపు స్వారీ పందేలు జరుగుతాయా? లేదా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Exit mobile version