NTV Telugu Site icon

Kurnool Kidnap Case: కర్నూలులో నగల వ్యాపారి కిడ్నాప్.. సినీఫక్కీలో పోలీసుల ఛేజ్..

Kidnap Case

Kidnap Case

Kurnool Kidnap Case: కర్నూలు జిల్లాలో ఓ నగల వ్యాపారి కిడ్నాప్‌ తీవ్ర కలకలం రేపింది.. బంగారు నగల వ్యాపారి వెంకటేష్ ను కిడ్నాప్ చేశారు దుండగులు.. ఎమ్మిగనూరు రహదారిలో వున్న వెంకటేష్ దుకాణాలు బాడిగకు కావాలంటూ కారులో తీసుకెళ్లారు.. అయితే, వెంకటేష్‌ అక్కడ దుకాణం చూయిస్తుండగా దాడి చేసి కారులో తీసుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తు్నారు.. అయితే, గూడూరులో కలకలం రేపిన నగల వ్యాపారి వెంకటేష్ కిడ్నాప్ కేసు సుఖాంతం అయ్యింది.. కిడ్నాప్ కు ఉపయోగించిన వాహనాన్ని సీజ్ చేసిన పోలీసుల.. ఒకరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది.. ఈ ఘటనలో మరో ఇద్దరు పరారీ అయ్యారని చెబుతున్నారు.. సినీఫక్కీలో కిడ్నాపర్లను వెంటాడి పట్టుకున్నారు పోలీసులు.. అనుమానాస్పదంగా వెళ్లున్న కారును పోలీసులు వెంబడించారు.. పోలీసులను చూసి వాహనం స్పీడ్‌ను మరింత పెంచారు కిడ్నాపర్లు.. దీంతో ఆ కారును పోలీసులు తమ వాహనంలో వెంబడించారు.. చనుగొండ్ల ఎల్ఎల్సి కాలువపై కిడ్నాపర్ల వాహనాన్ని పోలీసుల వాహనం ఢీకొట్టింది.. ఈ ఘటనలో టైర్ బరస్ట్ కావడంతో వాహనం నుంచి దూకి తప్పించుకున్నారు ఇద్దరు కిడ్నాపర్లు.. కారులో ఉన్న ఓ కిడ్నాపర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. వ్యాపారి వెంకటేష్‌ను కిడ్నాపర్ల చెరనుంచి విడిపించారు.

Read Also: Borewell Incident: బోరుబావిలో పడిన 3 ఏళ్ల బాలిక.. పుట్టిన రోజు వేడుకలకు ముందే ఘటన..

Show comments